Breaking News

ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు 

Published on Sat, 01/13/2024 - 05:22

సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. సర్విసు నిబంధనల్లోని క్రమశిక్షణ చర్యలు, వాటిపై అప్పీళ్లు, సమీక్షలకు సంబంధించి ఉద్యోగుల డిమాండ్‌పై సానుకూలంగా స్పందించింది. ఆమేరకు ఏపీఎస్‌ఆర్టీసీ  సర్విసు నిబంధనలు–2023లోని సెక్షన్‌–5ను సవరిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 జూలై 25 కంటే ముందు చేపట్టిన చర్యలకు ఈ సవరణ వర్తిస్తుందని పేర్కొంది.

ఉద్యోగులపై చర్యలకు సంబంధించి చార్జ్‌ïÙట్లను డిస్పోజ్‌ చేసేటప్పుడు ఉమ్మడి జిల్లా డిప్యూటీ సీటీఎంలను కమిటీ సభ్యులుగా  చేర్చడం, అప్పీళ్లను డిస్పోజ్‌ చేసేటప్పుడు రివ్యూ అథారిటీలో ఉమ్మడి జిల్లా రీజనల్‌ మేనేజర్‌ను సభ్యుడిగా చేర్చడం, ఆ పైస్థాయిలో  ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌కు మెర్సీ పిటిషన్‌ను పరిశీలించేందుకు అనుమతించింది. రెండేళ్లుగా అప్పీళ్లు, రివ్యూ అథారిటీ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు ప్రభుత్వ ఉత్తర్వులతో ఊరట లభించింది. వారి కేసుల సత్వర పరిష్కారానికి మార్గం సుగమమైంది.  2023 జులై 25 తరువాత వచ్చిన కేసులకు మాత్రం  తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు వేచి ఉండాలని అధికారులు పేర్కొన్నారు.  

ఉద్యోగ సంఘాల హర్షం 
సర్విసు నిబంధనలను సవరించడంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వానికి పలు సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్‌ ఆర్టీసీ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, కార్యనిర్వహణ అధ్యక్షుడు జీఏం నాయుడు, ప్రధాన కార్యదర్శి డీఎస్‌పీ రావు, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో కృతజ్ఞతలు తెలియజేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)