Breaking News

గుంటూరు మిర్చి: అ‘ధర’గొట్టిన ఎగుమతులు

Published on Mon, 07/31/2023 - 04:30

సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు మిర్చి ధరతో పాటు ఎగుమతుల్లోనూ తనకు పోటీ లేదని నిరూపించుకుంటోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు రూ.10,445 కోట్ల మార్కును దాటా యి. మిర్చి ఎగుమతుల చరిత్రలోనే ఇదో సరికొత్త రికార్డు కావటం విశేషం. ఎగుమతుల పరంగా పరిమాణంలో కొంతమేర తగ్గినప్పటికీ.. ధర ఎక్కువ గా ఉండటంతో గత ఏడాది కంటే రూ.1,861 కోట్ల ఆదాయం అధికంగా లభించింది. మిర్చి ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మిర్చి సాధారణ సాగు విస్తీర్ణం 78 వేల హెక్టార్లు కాగా.. 2022– 23లో అత్యధికంగా 84,861 హెక్టార్లలో సాగు చేశారు.  

అంతర్జాతీయంగా పెరిగిన గిరాకీ ప్రస్తుతం మన దేశం నుంచి చైనా, శ్రీలంక, మలే­షియా, థాయ్‌లాండ్, స్పెయిన్, అమెరికా, ఇంగ్లండ్, నేపాల్, నెదర్లాండ్స్, నైజీరియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్‌ సహా సుమారు 20 దేశాలకు మిర్చి ఎగుమతి అవుతోంది. కారం, విత్తనాలను సైతం ఎగుమతి చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇతర దేశాల్లోని మార్కెట్లపైనా గురిపెట్టేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రెండేళ్లలో గుంటూరు జిల్లాను అన్నిరకాల మిర్చికి ఎగుమతుల హబ్‌గా తయారు చేసేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జిల్లా ఎగుమతుల కార్యాచరణ ప్రణాళిక (డీఈఏపీ)లో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రతిపాదించింది. మిర్చితో పాటు పసుపు, అల్లం, ఇతర మసాలా ఉత్పత్తులతోపాటు పత్తి, నూలు ఎగుమతులపైనా దృష్టి సారించాలని నిర్ణయించింది.  

ఎక్స్‌పోర్టు హబ్‌గా మారుస్తాం 
గుంటూరును మిర్చి ఎక్స్‌పోర్ట్‌ హబ్‌గా మారిస్తే మౌలిక సదుపాయాల కల్పన, కనెక్టివిటీ, ముడి పదార్థాల లభ్యత పెంపు, నైపుణ్యం పెంపు, సాంకేతికత బదిలీ జరుగుతుంది. టూరిజాన్ని అభివృద్ధి చేయడం, అంతర్జాతీయ మార్కెటింగ్‌ ఈవెంట్స్‌ నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా ఎగుమతులకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది. 
– ఎం.వేణుగోపాలరెడ్డి, కలెక్టర్, గుంటూరు  

చిల్లీస్‌ బోర్డు ఏర్పాటు చేయాలి 
స్పైసెస్‌ బోర్డులో అత్యధిక విదేశీ ఆదాయాన్ని సమకూరుస్తున్న మిర్చి పంట కోసం కేంద్రం ప్రత్యేకంగా చిల్లీస్‌ బోర్డును ఏర్పాటు చేయాలి. పంట చేతికొచ్చిన తర్వాత విదేశాలకు ఎగుమతులపై దృష్టి పెడుతున్న బోర్డు, రైతులకు కావాల్సిన మంచి విత్తనం, దీనికి సంబంధించిన పరిశోధనలపై దృష్టి పెట్టడం లేదు. అందుకే చిల్లీస్‌కు ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయాలి. – తోట రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి, చిల్లీస్‌ ఎక్స్‌పోర్టర్స్‌ అసోసియేషన్‌ 

ధర ‘తేజో’మయమే 
ప్రస్తుతం గుంటూరు మిర్చి యార్డులో మిర్చికి మంచి గిట్టుబాటు ధర లభిస్తోంది. నాన్‌ ఏసీ కామన్‌ రకం 334, నంబర్‌–5, 273, 341, 4884, సూపర్‌–10 రకాల మిర్చి సగటు ధర క్వింటాల్‌కు రూ.9,000 నుంచి రూ.24,000 వరకు పలుకుతోంది. నాన్‌ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగి, దేవనూరు డీలక్స్‌ రకాల మిర్చి ధర  గరిష్టంగా రూ.25 వేల వరకు  పలికింది. ఏసీ కామన్‌ రకం మిర్చి క్వింటాల్‌కు రూ.12,500 నుంచి రూ.23,500 వరకు, ఏసీ ప్రత్యేక రకాల మిర్చికి రూ.14 వేల నుంచి రూ.25,500 వరకు ధర లభిస్తోంది. కారం తయారీకి అధికంగా ఉపయోగించే 341, దేవనూరు డీలక్స్, 334 రకాల మిర్చి క్వింటాల్‌ రూ.23 వేలకు పైగా పలుకుతోంది.   
 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)