Breaking News

చేదు మిగిల్చిన ఉగాది

Published on Mon, 03/31/2025 - 04:27

మడకశిర: శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో ఉగాది పండుగ నాడు ఒక స్వర్ణకారుడి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో భార్యాభర్తలతో పాటు ఇద్దరు కుమారులు మృతి చెందడం విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే.. మడకశిర గాందీబజార్‌లో సొంతింట్లో స్వర్ణకారుడు క్రిష్ణాచారి కుటుంబం నివాసం ఉంటోంది. 

ఏమైందో ఏమో కానీ క్రిష్ణాచారి (45), భార్య సరళ (38), పెద్ద కుమారుడు సంతోష్‌ (15), రెండో కుమారుడు భువనేష్‌ (13) మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో వెలుగులోకి వచి్చంది. మృతుడు క్రిష్ణాచారికి తండ్రితోపాటు గోపి, సురేష్‌ అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. చిన్న సోదరుడు సురేష్‌ ఇంట్లో ఉంటున్న తండ్రి ఉదయాన్నే క్రిష్ణాచారికి ఫోన్‌ చేశారు. ఫోన్‌ తీయకపోవడంతో సురేశ్‌ తన అన్న కిృష్ణాచారి ఇంటి వద్దకు వెళ్లి చూడగా లోపల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వెంటనే ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి తెలియజేశాడు.  

క్రిష్ణాచారి జేబులో సైనేడ్‌ డబ్బా..  
సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. క్లూస్‌ టీం ఇంటిని క్షుణ్నంగా పరిశీలించింది. క్రిష్ణాచారి జేబులో సైనేడ్‌ డబ్బా ఉన్నట్లు గుర్తించి స్వాదీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే క్రిష్ణాచారి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. క్రిష్ణాచారి ఆదివారం తెల్లవారుజామున ఆత్మహత్యకు ముందు బెంగళూరులో ఉన్న తన అక్కతో ఫోన్‌లో మాట్లాడినట్లు కాల్‌ డేటా ఆధారంగా పోలీసులు గుర్తించారు. 

అయ్యో పిల్లలు.. ఉగాదికి ఇంటికొచ్చి.. 
క్రిష్ణాచారి పెద్ద కుమారుడు సంతోష్‌ మడకశిర సమీపంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతూ.. పబ్లిక్‌ పరీక్షలు రాస్తున్నాడు. చిన్న కుమారుడు భువనేష్‌ అదే పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఇద్దరూ పాఠశాల హాస్టల్లో ఉంటూ.. ఉగాది సందర్భంగా ఇంటికొచ్చారు. వీరిద్దరూ తల్లిదండ్రులతోపాటు ప్రాణాలు కోల్పోయారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)