Breaking News

వరదతో లంకవాసుల జీవితం ఛిద్రం

Published on Fri, 09/13/2024 - 05:34

సాక్షి, అమలాపురం/సాక్షి, భీమవరం: గోదావరి, వశిష్ట గోదావరి మరోసారి పోటెత్తడంతో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు లంక గ్రామాల్లోని ప్రజల జీవితం ఛిద్రమైంది. ఈ ఏడాది గోదావరి వరద లంక గ్రామాలను ముంచడం ఇది మూడోసారి. జూలైలో వచ్చిన వరదకంటే ఇప్పుడు వరద భారీగా ఉంది. జూలై చివర్లో వచ్చిన వరదలకే పలు పంటలకు నష్టం వాటిల్లగా ప్రస్తుత వరదలకు అక్కడక్కడా మిగిలిఉన్న కాస్త పంటలు కూడా దెబ్బతిన్నాయి. 

వరదల ప్రభావం అంబేడ్కర్‌ జిల్లాలోని పి.గన్నవరం, ముమ్మిడివరం నియోజకవర్గాలపై అధికంగా ఉంది. ఈ నియోజకవర్గాల్లోని లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. 12 మండలాల్లోని 44 శివారు గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయి. కాజ్‌వేలతోపాటు ప్రధాన రోడ్లపై 5 అడుగుల ఎత్తున నీరు చేరడంతో లంకవాసులు, విద్యార్థులు పడవల మీదే రాకపోకలు సాగిస్తున్నారు. 

అప్పనపల్లి గ్రామం, బి.దొడ్డవరం ఇందిరమ్మ కాలనీ, అయినవిల్లి మండలంలో వీరవల్లిపాలెం, పొట్టిలంక, ముమ్మడివరం మండలంలోని లంకాఫ్‌ ఠాన్నేల్లంక, కూనాలంక, గురజాపులంక, అల్లవరం మండలం బోడసుకుర్రు పల్లిపాలెంలో వరద మరింత పెరిగింది. జిల్లాలోని మత్స్యకార గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. ఉద్యాన పంటలు మరోసారి పెద్ద ఎత్తున నీట మునిగాయి. అరటి, కంద, కోకో, కొబ్బరి, కూరగాయ పంటలు నీట నానుతున్నాయి. పాడి రైతులు పాలు అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. మత్స్యకారులు పది రోజులుగా వేట లేక ఇబ్బంది పడుతున్నారు.

లంక భూములను ముంచెత్తిన వశిష్ట గోదావరి
ఎగువ నుంచి ఉరకలెత్తుతూ వస్తున్న జలాలతో వశిష్ట గోదావరి సుడులు తిరుగుతూ ప్రవహిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట, పెనుగొండ, యలమంచిలి, నరసాపురం మండలాల్లోని పలు లంక గ్రామాలను వరద ముంచెత్తింది. ఆచంట, పెనుగొండ, యలమంచిలి, నరసాపురం మండలాల్లోని 600 ఎకరాల్లో కూరగాయలు, 80 ఎకరాల్లో తమలపాకుల పంటలకు నష్టం వాటిల్లింది. 

200 ఎకరాల్లోని అరటి తోటలను వరద ముంచెత్తింది. యలమంచిలి మండలం కనకాయలంక, పెదలంక, దొడ్డిపట్ల, లక్ష్మీపాలెం గ్రామాల్లో వరదనీరు చేరింది. వడ్డిలంక వద్ద స్లూయిజ్‌ గేటు సక్రమంగా మూసుకోకపోవడంతో గోదావరి నీరు నక్కల డ్రెయిన్‌లోకి ఎగదన్నుతోంది. 

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి