Breaking News

తగ్గుతున్న గోదావరి ఉధృతి

Published on Thu, 07/25/2024 - 05:35

సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/ఏలూరు:  గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి బుధవారం రాత్రి 7 గంటలకు 14,08,117 క్యూసెక్కులు చేరుతుండగా.. కాలువల ద్వారా 3,900 క్యూసెక్కులను వదులుతున్న అధికారులు.. మిగులుగా ఉన్న 14,04,217 క్యూసెక్కుల (121.35 టీఎంసీల)ను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఈ నీటి సంవత్సరంలో అంటే జూన్‌ 1 నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకూ ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 393 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలోకి వదిలేయాల్సి వచి్చంది. 

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 14.70 అడుగుల వద్ద కొనసాగుతుండటంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. గోదావరి బేసిన్‌లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరిలో ఎగువన వరద క్రమేణా తగ్గుతోంది. తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజీ నుంచి 7.87 లక్షలు, తుపాకులగూడెం బ్యారేజీ నుంచి 9.75 లక్షలు, దుమ్ముగూడెం బ్యారేజీ నుంచి 10.22 లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. దాంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 45.3 అడుగులకు తగ్గింది. దాంతో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. 

మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగుతోంది. ఇక పోలవరం బ్యారేజీలోకి 11,68,897 క్యూసెక్కులు చేరుతుండగా. అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. స్పిల్‌ వే ఎగువన 33.42 మీటర్లకు నీటి మట్టం తగ్గింది. ఎగువ వరద తగ్గిన నేపథ్యంలో గురువారం నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి దూకుడు తగ్గనుంది.



జలదిగ్బంధంలోనే వేలేరుపాడు 
వేలేరుపాడు మండలం జల దిగ్బంధంలోనే ఉంది. 33 గ్రామాల్లోకి నీరు ప్రవేశించి రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద తీవ్రత లేదనే కారణంతో బుధవారం ఉదయం నుంచి పునరావాస కేంద్రాలను అధికారులు నిలిపివేశారు. గ్రామాల్లో నీరు నిలిచి ఉన్నా ప్రజలు ఊళ్లకు వెళ్లాల్సి వచి్చంది. విలీన మండలాల్లోని కమ్మరిగూడెం, అల్లూరు నగర్, కోయ మాధవరం, రామవరం ఉదయ్‌నగర్, రాళ్లపూడిలో 208 ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా.. 146 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)