Breaking News

రక్తం మారింది... ప్రాణం పోయింది

Published on Thu, 02/06/2025 - 05:12

జగ్గంపేట: ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది మిడిమిడి జ్ఞానం ఓ విద్యార్థిని ఉసురు పోసుకుంది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన 16 ఏళ్ల బాలికకు.. వేరే గ్రూపు రక్తం ఎక్కించి ఆమె ప్రాణాలు పోవడానికి కారకులయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలివీ.. ప్రకాశం జిల్లాకు చెందిన ఆ బాలిక కాకినాడ జిల్లా జగ్గంపేటలోని పోలీస్‌స్టేషన్‌ వెనుక ప్రాంతంలో బంధువుల ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అనారోగ్యంతో ఆమెను రెండు రోజుల క్రితం జగ్గంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. 

ఆమెకు అత్యవసరంగా రక్తం ఎక్కించాల్సి వచ్చింది. అయితే, ఆ సమయానికి ఆస్పత్రి వైద్యుడు రాజమహేంద్రవరంలో ఉన్నారు. అక్కడి నుంచే ఆయన ఇచ్చిన సలహాలతో జగ్గంపేట ఆస్పత్రి సిబ్బంది రక్తం ఎక్కించారు. అయితే బాధిత బాలిక బ్లడ్‌ గ్రూపు ఒకటి అయితే, సిబ్బంది మరో గ్రూపు రక్తం ఎక్కించడంతో ఆరోగ్యం వికటించింది.  

ఈ క్రమంలో మూత్రంలో నుంచి, నోటి నుంచి రక్తం రావడంతో సిబ్బంది కంగారు పడి, రాజమహేంద్రవరంలో ఉన్న డాక్టర్‌కు సమాచారమిచ్చారు. ఆ డాక్టర్‌ సూచన మేరకు ఆ బాలికను తక్షణం రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ  మంగళవారం రాత్రి బాలిక ప్రాణాలు కోల్పోయింది. దీనిపై ఆమె బంధువులు ఆందోళన చేయడంతో రాజమహేంద్రవరానికి చెందిన ఒక టీడీపీ నేత ఎటువంటి కేసులు లేకుండా సెటిల్‌మెంట్‌ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)