Breaking News

పొందూరు ఖాదీకి జీఐ గుర్తింపు

Published on Sat, 12/13/2025 - 04:25

పొందూరు: ప్రపంచ ప్రఖ్యాత పొందూరు ఖాదీ పరిశ్రమకు విశేష గుర్తింపు లభించింది. పొందూరు ఖాదీకి భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్‌) ప్రకటిస్తూ వాణిజ్య, పరిశ్రమలశాఖ పరిధిలోని భౌగోళిక సూచికల రిజిస్ట్రీ శుక్రవారం అధికారిక పత్రాన్ని జారీచేసింది. 2020 నుంచి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పొందూరు ఖాదీ ఉన్నతికి విశేషంగా కృషి చేసింది. ఒక్కో ప్రాంతంలో తయారయ్యే లేదా ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల వస్తువులకు సహజంగా ఒక నాణ్యత ఉంటుంది.అదే వాటి ప్రత్యేకతగా నిలుస్తుంది. 

ఆ విశిష్టతను దృష్టిలో ఉంచుకుని వాటికి మరింత ప్రాధాన్యత ఇచ్చేవిధంగా జియోగ్రాఫికల్‌ ఇండికేషన్స్‌ ఆఫ్‌ గూడ్స్‌ (రిజి్రస్టేషన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) యాక్ట్‌ 1999ను రూపొందించారు. ఈ చట్టం కింద ఒక ప్రత్యేకమైన భౌగోళిక ప్రాంతం నుంచి వచ్చే ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు వర్తిస్తుంది. 

ఇందుకోసం భౌగోళిక సూచికల రిజిస్ట్రీ అనేక దఫాలుగా క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేస్తుంది. నాణ్యతని అన్నిదశల్లో పరీక్షిస్తుంది. ప్రజల్లో ఉన్న ఆదరణను సైతం పరిగణనలోకి తీసుకుంటుంది. పొందూరు ఖాదీకి జీఐ టాగ్‌ లభించడం వెనుక వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గతంలో విశేష కృషిచేసింది.  

జీఐ టాగ్‌ నంబర్‌ 1049:  పొందూరు ఖాదీకి జీఐ టాగ్‌ నంబర్‌ 1049 కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. చెన్నై కేంద్రంగా ఉన్న భోగోళిక సూచికల రిజిస్ట్రీ ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని వెలువరించింది. ఇంతవరకు బాస్మతి బియ్యం, డార్జిలింగ్‌ తేయాకు, కాంచీపురం పట్టుచీరలు, పోచంపల్లి చీరలు, మైసూరు పట్టు, నిర్మల్‌ బొమ్మ­లు, మైసూరు శాండిల్‌ సబ్బుతో పాటు పొందూరు ఖాదీ కూడా ఆ జాబితాలో చేరింది.

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)