Breaking News

‘గ్రామాలను మద్యంతో ముంచేస్తున్నారు.. వరదలా పారిస్తున్నారు’

Published on Fri, 08/22/2025 - 15:58

భీమవరం(ప.గో. జిల్లా):  బెల్ట్‌ షాపులు తొలగించాలని, అదే సమయంలో తమ ఉపాధిని కాపాడాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో భీమవరంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది.  శుక్రవారం(ఆగస్టు 22వ తేదీ)  జరిగిన ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి.  

దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కొల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి జుత్తిక నరసింహమూర్తి  మాట్లాడుతూ.. ‘ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 14 నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో అక్రమ మద్యం, కల్తీ మద్యం, బెల్టు షాపులతో మద్యాన్ని వరదలా పారిస్తున్నారు. 

గ్రామాలను మద్యంతో ముంచేస్తున్నారు. మంచినీళ్లు లేక అనేక గ్రామాలు ఉన్నాయి మంచినీళ్లు ఇవ్వటం మా వల్ల కాదు.. మద్యం తాగండి అని  కూటమి  ప్రభుత్వం చెబుతుంది. బెల్ట్ షాపులు తొలగించండి మా ఉపాధిని కాపాడండి తాటి చెట్టు పై నుంచి పడి మరణించిన వ్యక్తికి  ఎక్స్ గ్రేషియా  ఇవ్వండి అనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 

ఈ రాష్ట్రంలో 75 వేల బెల్టు షాపులు ఈ జిల్లాలో 4 వేల బెల్ట్ షాపులు తొలగించే వరకు మా పోరాటం ఆగదు. ఇదే ప్రభుత్వానికి మా హెచ్చరిక. ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మంత్రి బెల్ట్ షాపులు తొలగిస్తాం. బెల్ట్ షాపులు పెడితే తోలు వలిచేస్తాం అని అన్నారు. ఇప్పటివరకు మీరు ఎంతమంది తోలు తీశారు ఎన్ని బెల్ట్ షాపుల్లో తొలగించారు చెప్పాలని ప్రభుత్వాన్ని  డిమాండ్  చేస్తున్నాము. ఈనెల 30వ తారీఖున భీమవరం ఎక్సైజ్ కార్యాలయం వద్ద వందలాదిమంది గీత కార్మికులు మోకులు ధరించి పెద్ద ఎత్తున ఆ కార్యాలయాన్ని ముట్టడిస్తాం’ అని హెచ్చరించారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)