Breaking News

36 శాతం ‘వంట’ చెరకే! తొలి స్థానంలో మూడు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలివే..

Published on Mon, 04/10/2023 - 04:33

సాక్షి, అమరావతి:  దేశంలో 62 శాతం మంది వంట కోసం ఎల్‌పీజీ (గ్యాస్‌)ని వినియోగిస్తుండగా 36 శాతం ప్రజలు మాత్రం వంట చెరకునే వాడుతున్నట్లు కేంద్ర పర్యావరణ గణాంకాల నివేదిక వెల్లడించింది. 33.8 శాతం మంది కట్టెలు, పొట్టు, పంట అవశేషాలపై ఆధారపడుతుండగా 2.2 శాతం మంది వంట కోసం పిడకలను వినియోగిస్తున్నారు.

1.3 శాతం మంది కిరోసిన్, గోబర్‌ గ్యాస్, ఎలక్ట్రికల్, బొగ్గుల పొయ్యిపై వంట చేస్తున్నారు. ఇక ఎల్‌పీజీ వినియోగంలో గ్రామాలకు, పట్టణ ప్రాంతాలకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కట్టెలు, పొట్టు, పంట అవశేషాలు ఉచితంగా లభిస్తుండటంతోపాటు బూడిదను పంట పొలాలకు ఎరువుగా వాడుతున్నందున వీటివైపు మొగ్గు చూపుతున్నారు. ఇక భగ్గుమంటున్న గ్యాస్‌ ధరలు కూడా కారణమే. ఈమేరకు కేంద్ర పర్యావరణ నివేదిక 2023ని గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ విడుదల చేసింది.   

♦ గ్రామీణ ప్రాంతాల్లో 49.4 శాతం మంది ఎల్‌పీజీ వాడుతుండగా 46.7 శాతం మంది కట్టెలు, పొట్టు, పంట అవశేషాలపై ఆధార పడుతున్నారు. మూడు శాతం మంది పిడకలు, 0.7 శాతం మంది గోబర్‌ గ్యాస్, కిరోసిన్, ఎలక్ట్రికల్, బొగ్గుల పొయ్యిలను వాడుతున్నారు. 
♦ పట్టణ ప్రాంతాల్లో 89 శాతం మంది వంట కోసం ఎల్‌పీజీ వాడుతుండగా 6.5 శాతం మంది కట్టెలు, పొట్టు, పంట అవశేషాలను వినియోగిస్తున్నారు. 0.3 శాతం మంది పిడకలు, 2.5 శాతం గోబర్‌ గ్యాస్, ఎలక్ట్రికల్, కిరోసిన్, బొగ్గుల పొయ్యిలను వాడుతున్నారు.  
♦ ఛత్తీస్‌గఢ్‌ గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా 84.2 శాతం మంది వంట కోసం కట్టెలు, పొట్టు, పంట అవశేషాలపైనే ఆధారపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో 16.3 శాతం మంది కట్టెలు, పొట్టు, పంట అవశేషాలపై వంట చేస్తుండగా 81.7 శాతం మంది ఎల్‌పీజీ వినియోగిస్తున్నారు.  

#

Tags : 1

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)