Breaking News

ఆక్వా చెరువు బోరు నుంచి గ్యాస్‌

Published on Sun, 06/16/2024 - 05:48

రాజోలు: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు మండలంలో ఓ ఆక్వా చెరువు వద్ద బోరు బావి నుంచి నీటితో కలిసి 15 అడుగుల మేర గ్యాస్‌ పైకి ఎగజిమ్మింది. అయితే, మంటలు వ్యాపించకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... రాజోలు మండలంలోని చింతలపల్లి–అరవ­పాలెం రోడ్డులో కె.విజయేంద్రవర్మ అనే వ్యక్తికి చెందిన ఆక్వా చెరువు వద్ద ఉన్న బోరు బావి నుంచి శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆకస్మికంగా నీరు ఎగసిపడింది. 

విద్యుత్‌ మోటారు, ఆయిల్‌ ఇంజన్‌ వంటివి ఏమీ లేకుండానే బోరు బావి నుంచి నీరు 15 అడుగుల మేర ఎగసిపడుతుండటంతో సమీపంలోని కూలీలు వెళ్లి చూశారు. అయితే, గ్యాస్‌ వాసన రావడంతో భయాందోళనలకు గురైన కూలీలు వెంటనే రాజోలు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక అధికారి సీహెచ్‌ అనిల్‌కుమార్, సిబ్బంది గ్యాస్‌ లీక్‌ అవుతున్న బోరు బావి వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 

బోరు బావి లోపల తీవ్రమైన ఒత్తిడి పెరిగి, నీటితో కలసి గ్యాస్‌ ఉధృతంగా పైకి వస్తోందని గుర్తించారు. నీటిలో సుమారు ఆరు శాతం గ్యాస్‌ ఉందని నిర్ధారించారు. బోరు బావిని ఇసుకతో పూడ్చివేసి గ్యాస్‌ పైకి రాకుండా చేశారు. కొత్తగా బోర్లు వేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఉప్పు నీటి కోసం 200 మీటర్ల మేర భూమి లోపలకు బోర్లు వేయడం వల్ల గ్యాస్‌ పైకి వస్తుందని అనిల్‌కుమార్‌ చెప్పారు. కొన్నిసార్లు గ్యాస్‌ శాతం ఎక్కువగా ఉండడంతో మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని తెలిపారు.

Videos

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)