Breaking News

గరుడ వాహనంపై గోవిందుడు

Published on Wed, 10/09/2024 - 05:13

తిరుమల: విశ్వపతి శ్రీవేంకటేశ్వరుడు గరుడునిపై మంగళవారం అంగరంగ వైభవంగా ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. రాత్రి 6:30 గంటలకు ఆరంభమైన ఈ వాహన సేవ లక్షలాది మంది భక్తుల సమక్షంలో అర్ధరాత్రి వరకు సాగింది. గరుడ వా­హనంపై దేదీప్యమాన కాంతులతో ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తకోటిని మలయప్ప అనుగ్రహించారు. 

ఈ సేవలో గర్భాలయ మూ­లమూర్తికి అలంకరించే మకరకంఠి, లక్ష్మీహా­రం, సహస్ర నామ కాసులమాల, సుదర్శన చక్రమాల, మూలవిరాట్‌ పురాతన బ్రాస్‌లెట్‌ వంటి ఎన్నెన్నో విశేష ఆభరణాలు, శ్రీవిల్లి పుత్తూరు ఆండాళ్‌ తులసి, పుష్పమాల, చెన్నై నూతన ఛత్రాలను మలయప్పకు అలంకరించారు. భక్తకోటి గోవింద నామస్మరణతో తిరుమల క్షేత్రం భక్తిభావంతో నిండింది.

గరుడ వాహనం ముందు భక్త బృందాల భజనలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల వేషధారణలు, నగర సంకీర్తనలు విశేషంగా అలరించాయి. బ్రహ్మో­త్సవాల్లో ఐదవరోజు ఉదయం మంగళవారం శ్రీవారు మోహిని అవతారంలో దర్శనమిచ్చారు. తిరుమలలో బుధవారం శ్రీవారి స్వర్ణ రథోత్సవం (రథరంగ డోలోత్సవం) జరగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఆలయ పురవీధుల్లో స్వర్ణ రథంపై స్వామివారు ఊరేగనున్నారు. 

కిక్కిరిసిన తిరుమలగిరులు 
గరుడ వాహన సేవ దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఈ వాహన సేవలో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచే గ్యాలరీల్లో పడిగాపులు కాశారు. ఉదయం మోహినీ వాహన సేవలో పాల్గొన్న భక్తులే ఎక్కడికక్కడ గరుడ­వాహన సేవ కోసం నిరీక్షించారు. 2 లక్షల మంది కూర్చునే విధంగా సిద్ధం చేసిన గ్యాలరీలు మధ్యాహ్నం 1 గంటకే నిండిపోయాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)