Breaking News

నా కొడుకు బూడిదైనా ఇవ్వండి: సాయికృష్ణ తల్లి

Published on Wed, 06/17/2026 - 12:42

సాక్షి, విజయవాడ: నా కొడుకు వస్తాడని ఎదురుచూశాను.. పోలీసులు అయితే చంపి తగలబెడతారా?.. నా కొడుకు ఉంటే ఇవ్వండి.. లేదంటే బూడిద అయినా ఇవ్వండి అంటూ సాయి కృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. నా కొడుక్కి రాజకీయాలు అంటగాట్టొద్దు.. న్యాయం చేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాము పోలీసులకు వ్యతిరేకం కాదు.. కేవలం సీఐ నాగరాజు చేసిన అన్యాయంపై పోరాటం చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘సీఐ నాగరాజు నా కొడుకును చంపేస్తా అని చెప్పాడు. స్టేషన్‌లో కుర్రాళ్ళను కొడుతుంటే తట్టుకోలేక పోయాను. నా కొడుకును చూపించమని అడిగితే చూపించలేదు. బాబురావు అనే వ్యక్తి నా కొడుకును ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలి. నా కొడుకును కొట్టి బాత్ రూమ్‌లో పడేశాడు. నా కొడుకు వస్తాడని ఎదురు చూస్తున్నాను. నాకు సపోర్టుగా నిలిచినా వ్యక్తిపై నిందలు వేస్తున్నారు. పోలీసులు అయితే చంపి తగలబెడతారా?. నా కొడుకు ఉంటే ఇవ్వండి.. లేదా బూడిద ఇవ్వండి. నా కొడుక్కి రాజకీయాలు అంటగాట్టొద్దు. మాకు న్యాయం చేయండి. పిల్లోడినీ చంపి దహనం చేసి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. సీఐకి నా కొడుకును చంపే అధికారం, ధైర్యం ఎవడిచ్చాడు? అని ప్రశ్నించారు. దొంగ రాజకీయాలు చేయవద్దు అంటూ మండిపడ్డారు.

సాయికృష్ణ మేనమామ నవరంగ్ మాట్లాడుతూ..‘మాకు న్యాయం జరగాలి. రాజకీయాలు చేయడానికి, బెదిరించడానికి వచ్చింది అమ్మిశెట్టి వాసు. మేము పోలీసులకు వ్యతిరేకం కాదు.. కేవలం నాగరాజు చేసిన అన్యాయంపై పోరాటం చేస్తున్నాం. ప్రశ్నిస్తా అని చెప్పిన పవన్ కల్యాణ్‌ ఎందుకు మాట్లాడటం లేదు. మాకు న్యాయం కావాలని అడుగుతున్నాం. స్టేషన్ మొత్తం ఈ కేసులో వున్నారు. రభుత్వం సుమోటగా కేసు తీసుకొని న్యాయం చేయాలి’ అని డిమాండ్‌ చేశారు.

నీ కొడుకు చనిపోయాడు, ఆ రోజే చెప్పాడు ఇలా జరుగుతుంది అని కృష్ణ తల్లి

అడ్వకేట్ కనకదుర్గ మాట్లాడుతూ..‘సాయికృష్ణపై రెండు కేసులు మాత్రమే ఉన్నాయి. ఆ రెండు కేసుల్లో తీసుకొచ్చి కొట్టారు. రాజకీయాలకు సాయికృష్ణకు సంబంధం లేదు. దమ్ముంటే ముందుకు రావాలి నేను నిరూపిస్తాను. ఉంటే మృతదేహం ఇవ్వాలి.. లేదంటే బూడిదైనా ఇవ్వాలి’ అని డిమాండ్‌ చేశారు.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)