Breaking News

AP: ఉచితంగా అల్ట్రా, టిఫా స్కానింగ్‌ 

Published on Sat, 06/10/2023 - 04:09

గుంటూరుమెడికల్‌: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో గర్భిణులకు అ్రల్టాసౌండ్, టిఫా స్కానింగ్‌ సేవలు ఉచితంగా అందిస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. గర్భిణులకు ఎంతో ముఖ్యమైన అ్రల్టాసౌండ్, టిఫా స్కానింగ్‌లను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సేవలను మంత్రి రజిని శుక్రవారం గుంటూరులోని వేదాంతం హాస్పిటల్‌లో లాంఛనంగా ప్రారంభించారు. గర్భిణులకు సీమంతం చేసి పౌష్టికాహార కిట్‌లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఏటా 64వేల మందికిపైగా టిఫా స్కానింగ్‌ అవసరం ఉంటుందని, అందుకు దాదాపు రూ.7 కోట్ల ఖర్చవుతుందని, ఆ మొత్తాన్ని ఇకపై ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.

అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ ప్రతి గర్భిణికి రెండుసార్లు చేయాల్సి ఉంటుందని, వీటిని కూడా పూర్తి ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా చేసేలా సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ఆరో­గ్యశ్రీ ద్వారా 2022–23లో రూ.3,400 కోట్లకు పైగా ఖర్చు చేశామని తెలిపారు. 2022–23లో ఆరోగ్యశ్రీ కింద 2.32 లక్షల కాన్పులు ఉచితంగా చేశామని, కేవలం గర్భిణుల చికిత్సకు రూ.247 కోట్లు వెచ్చించామని వివరించారు.

ఆరోగ్య ఆసరా పథకం కింద రోగి కోలుకునే సమయంలో ప్రభుత్వం ఆర్థిక భరోసాను కల్పిస్తోందని చెప్పారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 17,54,000 మందికి పైగా ఆర్థిక ఆసరా అమలు చేశామని, అందుకోసం రూ.1,075 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళి గిరి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ జె.నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంధిరప్రసాద్, కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి, వేదాంత హాస్పిటల్‌ ఎండీ డాక్టర్‌ చింతా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)