Breaking News

మీ భోజనానికో దండం.. మిర్చికి మంచి ధర ఇప్పించండి

Published on Fri, 01/24/2025 - 05:30

కొరిటెపాడు (గుంటూరు): ‘అయ్యా..! మీ భోజనానికో దండం. మాకు ఉచిత భోజనం అవసరం లేదు. మెరుగైన ధర ఇప్పించేలా చూడండి మహాప్రభో అని మిర్చి రైతులు మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ ఎం.విజయ సునీత, గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎం.భార్గవ్‌తేజను వేడుకున్నారు. మిర్చి యార్డులో రైతులకు ఉచిత భోజన పథకాన్ని మార్కెటింగ్‌ శాఖ కమిషనర్, జాయింట్‌ కలెక్టర్‌ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యార్డుకు వచ్చిన రైతులంతా వారిద్దరినీ కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. 

మిర్చి యార్డులో ధరలు రోజురోజుకు పతనమవుతున్నాయని వాపోయారు. వారం క్రితం రూ.16 వేలు పలికిన క్వింటాల్‌ మిర్చి ప్రస్తుతం రూ.10 వేలు–రూ.13 వేల మధ్య ఊగిసలాడుతున్నాయని తెలిపారు. గత ఏడాది ఇదే సమయంలో క్వింటాల్‌కు రూ.21 వేల నుంచి రూ.26 వేల వరకు ధరలు లభించాయని గుర్తు చేశారు. ఉదయం పూట బేరం అయిన కాయలు కూడా మధ్యాహ్నానికి ధరలు మారిపోతున్నాయని వివరించారు.

కౌలు ధరలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు భారీ­గా పెరిగిపోతున్నాయన్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పంటను యార్డుకు తీసుకొస్తే కనీసం ఖర్చులు కూడా దక్కడం లేదని రైతులు వాపోయారు. ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు సాగు ఖర్చులయ్యాయని, దిగుబడి మాత్రం ఎకరాకు సగటున 10 క్వింటాళ్లు (తాలు, ఎరుపు కలిపి) కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. 

ఇవే ధరలు కొనసాగితే ఎకరాకు సుమారు రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు నష్టం వచ్చే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మేమే ఎంతో మందికి అన్నం పెడుతున్నాం. మాకు కావాల్సింది ఉచిత భోజనం కాదు. మెరుగైన ధర కల్పించి మా ప్రాణాలు, మా కుటుంబ సభ్యుల ప్రాణాలు కాపాడండి’ అంటూ చేతులు జోడించి రైతులంతా వేడుకున్నారు. 

ఈ సందర్భంగా మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ ఎం.విజయ సునీత, జాయింట్‌ కలెక్టర్‌ భార్గవ్‌ తేజ మాట్లాడుతూ రైతులకు మెరుగైన ధర వచ్చేలా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)