Breaking News

మహిళలకు ఉచిత బస్సు... మరింత దూరం!

Published on Sun, 12/22/2024 - 05:22

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరింత ఆలస్యం కానుంది. అధ్యయనం పేరుతో ఓ కమిటీని నియమించిన ప్రభుత్వం... దానికి కాలపరిమితిని విధించకపోవడమే ఇందుకు కారణం. కాలయాపన కోసమే ఈ కమిటీని నియమించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని మహిళలు అందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి హామీ ఇచ్చింది. 

సూపర్‌ సిక్స్‌ పేరిట ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పేర్కొంది. అయితే అధికారం చేపట్టి ఆరు నెలలు దాటినా మహిళలకు ఉచిత బస్సు హామీని అమలు చేయలేదు. ఇప్పుడు ఉచిత బస్సు అమలు కోసం అధ్యయనం పేరుతో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. 

వాస్తవానికి తెలంగాణతోపాటు కర్ణాటక తదితర రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమల్లో ఉంది. దీనిపై పెద్ద అధ్యయనం చేయాల్సిన అవసరం లేదని, అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే వెంటనే ప్రారంభించవచ్చని ఉన్నతాధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.  

రవాణా శాఖ మంత్రి అధ్యక్షతన కమిటీ... 
మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించడంపై అధ్యయనం కోసం రవాణా శాఖ మంత్రి అధ్యక్షతన ప్రభుత్వం కమిటీని నియమించింది. మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, హోంమంత్రి సభ్యులుగా, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్‌గా ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. 

ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాలను ఈ బృందం సందర్శించి అక్కడ విధానాలపై అధ్యయ­నం చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో అమలుకు తగిన నమూనాను మంత్రుల బృందం రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

అయితే, మంత్రుల బృందం నమూనా రూపొందించి ప్రభుత్వానికి సమర్పించేందుకు నిర్దిష్ట సమయం ఏదీ ఉత్తర్వుల్లో పేర్కొనకుండా వీలైనంత త్వరగా... అంటూ ముక్తాయింపు ఇచ్చారు. దీంతో కాలయాపన కోసమే ఈ కమిటీని నియమించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)