Breaking News

ఉచిత బస్సు జిల్లా వరకే..!

Published on Wed, 07/09/2025 - 07:48

సాక్షి, న్యూఢిల్లీ: సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు హామీకి కూటమి ప్రభుత్వం ఆంక్షల బ్రేక్‌ వేస్తోంది. కేవలం జిల్లా వరకు మాత్రమే మహిళల ఉచిత ప్రయాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ విషయంపై మంత్రులే లీకులిస్తున్నారు. గతంలో మంత్రి సంధ్యారాణి ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లాకే పరిమితం చేస్తున్నట్లు ప్రకటించగా.. 

తాజాగా హస్తిన పర్యటనకు వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా జిల్లా వరకే ఉచిత ప్రయాణమని చెప్పా­రు. దీనిపై రవాణాశాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమా­చారం. ఆగస్టు 15 నుంచి  పాత జిల్లాల పరిధిలోనే ఉచిత బస్సు పథM­ý ం అమలు చేయాలని సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇది మహిళలను మోసగించడమేనని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
  
ఉద్దేశపూర్వకంగానే మంత్రుల ద్వారా లీకులు! 
ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఉచిత బస్సుపై మంత్రుల ద్వారా లీకులు ఇప్పిస్తోందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. హామీ ఇచ్చేటప్పుడు లేని ఆంక్షలు ఇప్పుడు ఎందుకనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. గతంలో మంత్రి సంధ్యారాణి జిల్లా వరకే ఉచిత బస్సు అని ప్రకటించి తాను అలా అనలేదని ఆనక మాట మార్చారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు పాత జిల్లాల వరకే ఉచిత బస్సు ప్రయాణ అమలుకు ఉన్న సాధ్యాసాధ్యాలను సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నట్టు నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఉచిత బస్సు వల్ల భారం పడుతుందని అనుకూల పత్రికల ద్వారా విస్తృత ప్రచారం చేయిస్తున్నారు. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హామీ ఇచ్చేటప్పుడు భారం పడుతుందని తెలీదా అంటూ అక్కచెల్లెమ్మలు మండిపడుతున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)