Breaking News

అమ్మ చనిపోదాం అంటోంది.. ఆదుకోండి మేడమ్‌

Published on Tue, 07/01/2025 - 05:26

ప్రాంతం: గుంటూరు జిల్లా కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణంలోని శంకరన్‌ భవన్‌
సందర్భం: ప్రజా ఫిర్యాదుల వేదిక (గ్రీవెన్స్‌సెల్‌)

లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్‌) :కలెక్టర్‌ నేతృత్వంలో నిర్వహించిన వేదిక కావడంతో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టేందుకు బారులు తీరారు. ఇంతలో ఓ తొమ్మిదేళ్ల బాలుడు స్కూల్‌ బ్యాగ్‌తో అక్కడికి వచ్చాడు. ఆ బుడతడి మోములో ఏదో తెలియని అమాయకత్వం. తన చిట్టి చేతుల్లో ఏదో రాసుకున్న వినతిపత్రం కనిపించింది. దీన్ని గమనించిన పాత్రికేయులు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి వద్దకు తీసుకువెళ్లారు. అలా కలెక్టర్‌ను కలిసిన ఆ బాలుడు ఓ వినతి పత్రం అందించి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే...

హృద్రోగంతో బాలుడు.. ఉపాధికి దూరమైన కుటుంబం
గుంటూరు నగరంలోని వెంకటరావుపేటకు చెందిన అలవాల రాధిక, భర్త రామ సుబ్బారెడ్డి దంపతుల కుమారుడు యశ్వంత్‌. నగరంలో ఓ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. యశ్వంత్‌ పుట్టుకతో హృద్రోగ బాధితుడు. వైద్యులను సంప్రదించగా 16 ఏళ్లు నిండాకనే ఆపరేషన్‌ చేస్తామని,  అప్పటి వరకు మందులు వాడాల్సిందిగా సూచించారు. దీనికితోడు కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. కుటుంబం గడవడం   కష్టతరంగా మారింది. దీంతో గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రి అత్యవసర విభాగం గేటు బయట భాగంలో టిఫిన్‌ బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు.

రోడ్డు విస్తరణలో భాగంగా ఆ బండిని తీసెయ్యాల్సి వచ్చింది. దీంతో ఆ కుటుంబానికి ఉపాధి దూరమైంది. ఈ పరిణామం తల్లి రాధికను తీవ్రంగా బాధించింది. ఓ వైపు కన్నకొడుకు అనారోగ్యం, మరోవైపు ఉపాధి కోల్పోవడంతో మానసికంగా కలత చెందింది. మనం చనిపోదాం..ఇన్ని కష్టాలతో బతకలేమంటూ యశ్వంత్‌ ఎదుట పదేపదే అనడంతో ఆ బాలుడికి ఏం చేయాలో తోచలేదు. చివరికి జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి వద్దకు వెళ్ళి వినతి పత్రం అందజేసి తన గోడును విన్నవించుకున్నాడు. కలెక్టర్‌ చొరవ..కుటుంబానికి తోవ కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ కమిషనర్‌ స్పందించారు. గుంటూరు జీజీహెచ్‌ ఎదుట టిఫిన్‌ బండి నడిపేందుకు  స్థలం చూపించారు. 

గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో విచిత్ర ఘటన

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)