Breaking News

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు గల్లంతు

Published on Mon, 11/24/2025 - 03:24

కొమరాడ/దేవరాపల్లి/అనంతగిరి (అరకులోయ): వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు గల్లంతయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం జంఝావతి రబ్బరు డ్యాంలో స్నానం కోసం దిగిన ముగ్గురు ఆదివారం గల్లంతయ్యారు. 

శివిని గ్రామా­నికి చెందిన అధికారి గోవిందనాయుడు (35), అరసాడ ప్రదీప్‌ (29), రాయఘడ శరత్‌కుమార్‌ (17) పిక్నిక్‌ కోసం జంఝావతి రబ్బరు డ్యాం వద్దకు వెళ్లారు. సాయంత్రం డ్యాంలో స్నానం చేసేందుకు దిగి ప్రవాహం కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసు, అగ్నిమాపక అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.  

రైవాడ జలాశయంలో పడవ బోల్తా.. 
అల్లూరి జిల్లా జీనబాడులోని రైవాడ జలాశయంలో పడవ బోల్తా పడి ముగ్గురు గల్లంతయ్యారు. వివరాలు..జీనబాడుకు చెందిన గాలి అప్పలరాజు అటవీ శాఖలో తాత్కాలిక ప్రొటెక్షన్‌ వాచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కొండ నుంచి కలప అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం తెలుసుకున్న అప్పలరాజు, జాలాడ ప్రసాద్‌ బోటులో జలాశయం గేట్ల వద్దకు వెళ్లి కలపను పట్టుకున్నారు. 

తిరిగి వచ్చేటప్పుడు గంజాయి జీవన్, దేబార రమేష్‌లను అదే పడవలో ఎక్కించుకొని రేవు వద్దకు వస్తుండగా.. పడవ నీట మునిగింది. ప్రసాద్‌ పడవని పట్టుకొని కేకలు వేయడంతో సమీపంలో అతని తండ్రి సత్యం, బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రసాద్‌ను, జీవన్‌(19) మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. అప్పలరాజు (24), రమేష్‌ (18)ల కోసం గాలిస్తున్నారు.   

Videos

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

సంచలనం రేపుతున్న ప్రశాంత్ భూషణ్ ట్వీట్

ఏం చంపుతావా? విడదల రజినీని నెట్టేసి కిందపడేసిన SI

బంగారానికి ఏమైంది? వరుసగా పడిపోతున్న ధరలు!

జగన్ లాస్ట్ పంచ్... జస్ట్ సింగిల్ డిజిట్!

పోరాడిన ప్రతి అక్కచెల్లమ్మకు హ్యాట్స్ ఆఫ్.. జగన్ ఎమోషనల్

Photos

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం...నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)

+5

సంజూ, నమన్ మెరుపులు.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్ (ఫొటోలు)