Breaking News

ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పై నాలుగు కేసులు నమోదు

Published on Tue, 11/19/2024 - 05:22

యర్రగొండపాలెం/టెక్కలి/మంత్రాలయం/ పామూరు:  ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు సోమవారం ఎస్‌ఐ చౌడయ్య ఆయనకు మెమోలు అందజేశారు. మంత్రి లోకేశ్‌పై ట్వీట్‌ చేసిన కేసు ఒకటి కాగా, మరో మూడు కేసులు ఎన్నికల సమయంలో రిటర్నింగ్‌ అధికారి పెట్టిన కేసులుగా ఎస్‌ఐ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తమ గళం వినిపిస్తూనే ఉంటామని, ఇలాంటి కేసులకు బెదిరేది లేదన్నారు.   

ఎమ్మెల్సీ దువ్వాడపై ఫిర్యాదు 
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలంటూ జనసేన టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి కణితి కిరణ్‌ కుమార్‌ సోమవారం టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌పై దువ్వాడ శ్రీని­వాస్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని దీనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.   

సోషల్‌ మీడియా యాక్టివిస్టుపై కేసు 
సోషల్‌ మీడియా యాక్టి­­­వి­స్టులపై టీడీపీ కూటమి అక్కసు వెళ్లగక్కు­తూనే ఉంది. ఎక్కడికక్కడ కేసులు పెడుతూనే ఉంది. సోమవారం రాత్రి మంత్రాలయం నియోజక­వర్గం కౌతాళం పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టు బగ్గు జయరామ్‌పై కేసు నమోదు చేసినట్టు సీఐ చెప్పారు. 

మరో సోషల్‌ మీడియా యాక్టివిస్టుకు రిమాండ్‌ 
సోషల్‌ మీడియాలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ తదితరులపై పోస్టులు పెట్టిన వ్యక్తికి సోమవారం కనిగిరి జేఎఫ్‌సీఎం 14 రోజుల రిమాండ్‌ విధించినట్టు ఎస్‌ఐ కిషోర్‌బాబు తెలిపారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం రాజోలు మల్కిపురానికి చెందిన సోషల్‌ మీడియా యాక్టివిస్టు నానిబాబుపై పామూరుకు చెందిన మోషే ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నానిబాబును ఆదివారం అరెస్ట్‌ చేసినట్టు ఎస్‌ఐ చెప్పారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)