Breaking News

ఏపీ హైకోర్టుకు నలుగురు అదనపు జడ్జీలు

Published on Thu, 10/19/2023 - 05:01

సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నలుగురు నియమితుల­య్యా­రు. నూనెపల్లి హరినాథ్, మండవ కిరణ్మయి, జగడం సుమతి, న్యాపతి విజయ్‌ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోద ముద్ర వేశారు. వీరి నియామకాలను నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ సైతం జారీ చేసింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల పాటు వీరు హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా కొనసాగుతారు.

వీరితో శుక్రవారం ఉదయం హైకోర్టు సీజే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ప్ర­మాణం చేయిస్తారు. కాగా.. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గుహనాథన్‌ నరేందర్‌ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఆయన ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారన్న విషయం తెలియాల్సి ఉంది. జస్టిస్‌ నరేందర్‌ రాష్ట్ర హైకోర్టులో నంబర్‌ త్రీ స్థానంలో ఉంటారు.

ఇదే సమయంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్‌ దుప్పల వెంకటరమణ బదిలీకి సైతం రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ గుజరాత్‌ హైకోర్టుకు, జస్టిస్‌ వెంకటరమణ మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు బదిలీ అయ్యారు. కొత్తగా వచ్చే న్యాయమూర్తులు, బదిలీపై వెళ్లే ఇద్దరు న్యాయమూర్తులతో కలిపి హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరుతుంది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)