Breaking News

అమరావతిలో 47వేల గృహాలకు జూలై 8న శంకుస్థాపన: అజయ్‌జైన్‌

Published on Wed, 06/28/2023 - 10:25

సాక్షి, అమరావతి: సీఆర్‌డీఏ పరిధిలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన నిరుపేదల సొంతింటి కల సాకారం దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సీఆర్‌డీఏ పరిధిలో 50,793 మంది అక్కచెల్లెమ్మలకు ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇంటి స్థలాలను ఇప్పటికే ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 47వేల గృహాలకు జూలై 8న శంకుస్థాపన చేయనున్నట్టు గృహనిర్మాణ శాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్‌ తెలిపారు. 

ఈ సందర్భంగా అజయ్‌ జైన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో 50వేల మంది నిరుపేదలకు మే 26వ తేదీన సీఎం జగన్‌ చేతులమీదుగా ఇళ్ల పట్టాలిచ్చాం. కేంద్రం తొలిదఫాగా 47వేల ఇళ్లను మంజూరు చేసింది. రెండో దశలో మరో 3వేల ఇళ్లు మంజూరవుతాయి. ఇప్పటికే ల్యాండ్‌ లెవెలింగ్‌ కోసం సీఆర్‌డీఏకి రూ.30కోట్లు ఇచ్చాం. ఎల్లుండి గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల కలెక్టర్లతో సమావేశం జరుగనుంది. 

తాగునీరు, విద్యుత్‌, డ్రైనేజ్‌ తదితర మౌలిక సదుపాయాల కల్పనపై నిర్ణయాలు తీసుకుంటాం. లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాల జారీ సహా మ్యాపింగ్‌, జియో ట్యాగింగ్‌, షేర్‌వాల్‌ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు చేపడతాం. దశలవారీగా ఆరు నుంచి 9 నెలల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం’ అని స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: వృత్తి నిపుణుల జాబితాలోకి కౌలు రైతులు

Videos

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)