Breaking News

టీటీడీ గోవుల మరణాలపై కోర్టులో కేసు వేస్తా

Published on Sat, 04/19/2025 - 03:30

సాక్షి, అమరావతి: టీటీడీ గోశాలలో ఒకేసారి వందల గోవులు చనిపోవడం అనుమానాలు రేకెత్తిస్తోందని, దీనివెనుక కుట్ర ఉందని, అన్ని కోణాల్లో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని కేంద్ర మాజీ మంత్రి, విరాట్‌ హిందూస్థాన్‌ సంఘం అధ్యక్షుడు సుబ్రమణియన్‌స్వామి అభిప్రాయపడ్డారు. కొన్ని గోవులే చనిపోయాయని తేలిగ్గా వదిలేసే విషయం కాదని, ఇది చాలా తీవ్రమైన అంశమని అన్నారు. తిరుపతి నుంచి అధికారికంగా అందుబాటులో ఉన్న సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే తిరుమల వెళ్లి పూజల్లో పాల్గొన్న అనంతరం గోవుల మరణంపై అదనపు సమాచారం సేకరించి, జూలై మొదటి వారంలోగా కోర్టును ఆశ్రయించనున్నట్లు వివరించారు. 

సమర్థ చర్యలు తీసుకోవడంలో విఫలమైన ప్రభుత్వం.. ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు నమోదు చేస్తోందని, ఇదొక సర్వ సాధారణంగా మారిందని సుబ్రమణియన్‌స్వామి ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లమంది ఆరాధ్య దైవంగా భావించే గోవుల రక్షణకు రాజ్యాంగ పరంగా ప్రాధాన్యం ఉందని.. కానీ, టీటీడీ పెద్దలు, ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందని పేర్కొన్నారు. గోవుల మృతిపై టీటీడీ చైర్మన్‌ నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా మాట్లాడడాన్ని సుబ్రమణియన్‌స్వామి తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని, లేదంటే సీఎం చంద్రబాబే తప్పించాలని డిమాండ్‌ చేశారు. 

సుబ్రమణియన్‌స్వామి శుక్రవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘టీటీడీ గోవుల మృతి నాకు చాలా బాధ కలిగించింది. ఎన్ని చనిపోయాయన్నది కాదు. రాజ్యాంగంలో గో సంరక్షణ గురించి స్పష్టంగా ఉంది. ప్రతి ప్రభుత్వం అందుకు కట్టుబడి ఉండాలి. వయసు మళ్లిన మనుషుల్లాగే గోవులు కూడా చనిపోతున్నాయంటూ టీడీడీ చైర్మన్‌ బాధ్యతారహితంగా మాట్లాడారు. రేపు నువ్వు చనిపోతే కూడా వయసు మళ్లిందని వదిలేస్తారా? ఎవరినైనా వృద్ధులని చంపేస్తుంటే అది సాధారణమే అనుకోవచ్చా? ఇవి పరిణతి లేని వ్యాఖ్యలు.

చంద్రబాబు ప్రభుత్వానిది వ్యాపార ధోరణి
గోవుల జీవనశైలి భిన్నమైనది. చాలా ఊళ్లలో ఎవరి అజమాయిషీ లేకుండా ఆరోగ్యంగా జీవిస్తుంటాయి. ఒకేసారి పెద్ద సంఖ్యలో చనిపోయే పరిస్థితి సాధారణంగా ఉండదు. టీటీడీలో చంద్రబాబు ప్రభుత్వ వ్యాపార ధోరణి కారణంగా ఇలా జరుగుతుండొచ్చు. గోవులకు సరైన వైద్యం అందించకుండా వదిలేస్తున్నందుకే ఇలా జరిగి ఉండొచ్చు. ఈ విషయాన్ని ఆషామాషీగా తీసుకోలేం. 

గోవుల కళేబరాలను ఏం చేశారన్నది తేలాల్సి ఉంది. మాంసాన్ని రెస్టారెంట్లకు పంపుతున్నారా? గోవు కోట్లాది మందికి ఆరాధ్య దైవం. రాజ్యాంగంలో గోవుకు అత్యున్నత స్థానం కల్పించారు. టీటీడీ చైర్మన్‌ దానిగురించి తెలుసుకోవాలి. రాజ్యాంగంపై అవగాహన ఉన్నవారు ఎవరూ అలా మాట్లాడరు. ఒకేసారి పెద్ద సంఖ్యలో గోవుల మృతి వెనుక టీటీడీ నిర్లక్ష్యం ఉందని ప్రజలు అనుకుంటున్నారు. అందుకని టీటీడీ చైర్మన్‌ రాజీనామా చేయాలి.

టీటీడీలో పాలనా వైఫల్యం
వరుస ఘటనలు టీటీడీ పాలనా వైఫల్యాలే. టీటీడీ బోర్డు పాలన అధ్వానంగా ఉంది. సీఎం వెంటనే చైర్మన్‌ను బర్తరఫ్‌ చేయాలి. గత ప్రభుత్వంలో టీటీడీ నిర్వహణ చేపట్టినవారు ప్రతి అంశంలో బాధ్యతగా వ్యవహరించారు. చైర్మన్‌ అందరికీ అందుబాటులో ఉండేవారు. ఎవరు ఏమడిగినా సమాధానం ఇచ్చేవారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)