Breaking News

స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వాల్సిన కేసులో రిమాండ్‌ కోరతారా?

Published on Sat, 10/04/2025 - 05:02

కడప అర్బన్‌: ‘పోలీస్‌స్టేషన్‌లోనే బెయిల్‌ ఇవ్వాల్సిన కేసులో రిమాండ్‌ కోరతారా? వెంటనే నిందితునికి 41ఏ నోటీసులిచ్చి విడుదల చేయాల’ని కడప వన్‌టౌన్‌ పోలీసులపై వైఎస్సార్‌ కడప జిల్లా మూడో అదనపు మేజిస్ట్రేట్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తంచేశారు. కేవలం సామాజిక మాధ్యమంలో ఒక పోస్టు­ను షేర్‌ చేస్తేనే అరెస్టుచేసి రిమాండ్‌కు పెడతారా అని ఆమె ప్రశ్నించారు. వివరాలివీ.. కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి తీరును నిరసిస్తూ టీడీపీ సీనియర్‌ మహిళలు 2024 ఎన్నికల్లో మూసాపేట సర్కిల్‌లో ఆందోళన చేపట్టారు. 

ఈ ఆందోళన వీడియోలను అంజద్‌ బాషా పీఏ ఖాజా ఇటీవల షేర్‌ చేశారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్‌. శ్రీనివాసులరెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో సెప్టెంబరు 29న పోలీసులు ఖాజాపై కేసు నమోదు చేశారు. ఈనెల 1న హైదరాబాద్‌లో ఖాజాను పోలీసులు అరెస్టుచేసి కడపకు తీసుకొచ్చారు. రిమాండ్‌ నిమిత్తం గురువారం మధ్యా­హ్నం కోర్టులో ఖాజాను హాజరు­పరిచారు. అయితే, పోలీసుల అక్రమ అరెస్టుపై కడప జిల్లా మూడో అదనపు మేజిస్ట్రేట్ విజయలక్ష్మి మండిపడ్డారు.

 స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చే కేసులో రిమాండ్‌ కోరడం ఏమిటని ప్రశ్నించారు. కేవలం సోషల్‌ మీడియా పోస్ట్‌ షేర్‌చేస్తేనే రిమాండ్‌కి పెడతారా అని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. 41ఏ నోటీసులిచ్చి వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. మేజిస్ట్రేట్‌ ఆదేశాలతో అంజాద్‌ బాషా పీఏ ఖాజాను పోలీసులు గురువారం సాయంత్రం విడుదల చేశారు. 

Videos

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)