Breaking News

‘ఉక్కు’ సంకల్పంతో అండగా ఉంటాం

Published on Fri, 10/10/2025 - 05:52

సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులకు ఉక్కు సంకల్పంతో ఎప్పుడూ అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. గురువారం నర్సీపట్నం పర్యటన సందర్భంగా విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో వెళ్తున్న వైఎస్‌ జగన్‌ను స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు కలిశారు. ప్లాంట్‌ను ఎలాగైనా కాపాడాలని కోరారు. కాకానినగర్‌ వద్ద వారంతా వైఎస్‌ జగన్‌ కోసం నిరీక్షించి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగ, కార్మిక సంఘం నాయకులతో మాట్లాడిన వైఎస్‌ జగన్‌ తాజా పరిణామాల గురించి చర్చించారు. 

స్టీల్‌ ప్లాంట్‌ను కాపా­డతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన టీడీపీ కూటమి మోసం చేస్తోందని వారంతా ఆవేదన వ్యక్తంచేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నంత వరకూ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆగిందని.. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కో విభాగాన్ని ప్రైవేట్‌పరం చేస్తుండటం ఆందోళన కలిగిస్తోందని వాపోయారు. 

స్టీల్‌ ప్లాంట్‌పై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ప్రత్యేకంగా గనులు కేటాయించడం.. సెయిల్‌లో విలీనం చేయడంతో పాటు సంస్థలో తొలగించిన ఉద్యోగులను తిరిగి వి«ధుల్లోకి తీసుకోవాలనే డిమాండ్లతో పోరాటం చేస్తున్నామని కార్మిక సంఘాల నాయకులు వైఎస్‌ జగన్‌ దృష్టికి తెచ్చా­రు. 

సంఘటితంగా పోరాడదాం.. 
స్టీల్‌ ప్లాంట్‌ కార్మికుల విన్నపాలపై వైఎస్‌ జగన్‌ సాను­కూలంగా స్పందించారు. వారి ప్రతి డిమాండ్‌ని పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వం ఎదుట ఉంచుతామని హామీ ఇచ్చారు. తాము అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా.. ఎప్పుడూ తమ వైఖరి ఒక్క­టేనని, స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవ­డమే లక్ష్యమని పున­రు­ద్ఘాటించారు. వైఎస్సార్‌సీపీ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులకు ఎప్పుడూ తోడుగా ఉంటుందని, ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకూడదన్నదే తమ లక్ష్యమని తేల్చి చెప్పారు. ఆ దిశగా నిరంతరం కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. అన్ని డిమాండ్లపైనా కలసికట్టుగా పోరాటం చేద్దామని వారికి గట్టి భరోసా ఇచ్చారు.  

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)