Breaking News

కడలి వైపు నదుల పరుగులు

Published on Thu, 08/21/2025 - 05:13

సాక్షి, అమరావతి/విజయపురి సౌత్‌/సత్రశాల/అచ్చంపేట/గాందీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌):  కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదుల్లో వరద ఉధృతి బుధవారం మరింత పెరిగింది. కడలి వైపు నదులు పరుగులు తీస్తున్నాయి. కృష్ణా ప్రధాన పాయతోపాటు ఉప నదులు తుంగభద్ర, భీమా వరదెత్తి ప్రవహిస్తున్నాయి. 

తుంగభద్ర డ్యాంలోకి 1.30 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 1.21 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. మంత్రాలయం వద్ద తుంగభద్ర వరద నీటిమట్టం 311.32 మీటర్లకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,78,032 క్యూసెక్కులు చేరుతోంది. దీంతో 4,85,397 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. 

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులోకి 4,87,037 క్యూసెక్కులు చేరుతుండగా 4,48,761 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 4,45,187 క్యూసెక్కులు చేరుతుండగా 4,81,102 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి 4,64,064 క్యూసెక్కులు చేరుతుండగా.. 4,59,786 క్యూసె­క్కు­లను సముద్రంలోకి వదిలేస్తున్నారు. కృష్ణా వరద ఉధృతి పెరగడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.  

గోదావరి ఉగ్రరూపం 
గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశాలలో కురిసిన వర్షాల ప్రభావం వల్ల గోదావరి ప్రధాన పాయతోపాటు ప్రాణహిత, ఇంద్రావతి, మానేరు, శబరి ఉప నదులు, వంకలు, వాగులు పరవళ్లు తొక్కుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం గంట గంటకూ పెరుగుతోంది. బుధవారం ఉదయం 9 గంటలకు వరద నీటి మట్టం 43.2 అడుగులకు చేరుకోవడంతో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. 

బుధవారం అర్ధరాత్రి దాటాక భద్రాచలం వద్ద వరద మట్టం 48 అడుగులను దాటే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీలోకి 8,25,477 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 4,800 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 8,20,677 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. వంశధార, నాగావళి పోటాపోటీగా ప్రవహిస్తున్నాయి. వంశధార నుంచి గొట్టా బ్యారేజీలోకి 17 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. 15,661 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)