నిండుకుండలా సాగర్‌

Published on Mon, 07/28/2025 - 05:49

సాక్షి, నరసరావుపేట: కృష్ణానదికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు వరదప్రవాహం కొనసాగుతోంది. నాగార్జునసాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, 312.045 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ఆదివారం సాయంత్రానికి నీటిమట్టం 582.90 అడుగులు వద్ద ఉండగా, నీటి నిల్వ 291.3795 టీఎంసీలకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌కు 93,115 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. 

ఇందులో శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 66,417 క్యూసెక్కులు, స్పిల్‌ వే ద్వారా మరో 26,698 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది.  కాలువల ద్వారా 35,749 క్యూసెక్కులు కిందకు వదలుతున్నారు. మరో 20 టీఎంసీల నీరు వస్తే నాగార్జున సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుతుంది. మరోవైపు పులిచింతల ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్టు నీటిమట్టం 24.08 టీఎంసీలకు చేరింది. ఎగువనుంచి పులిచింతలకు 26,430 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. 

రేపు క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటి విడుదల 
కృష్ణానదిలో ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటం, ప్రాజెక్టు నీటి మట్టం ఇప్పటికే 583 అడుగులకు చేరింది. దీంతో మంగళవారం నాగార్జునసాగర్‌ క్రస్ట్‌ గేట్లను ఎత్తి వరదనీటిని దిగువకు విడుదల చేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.  

పోటెత్తిన తుంగభద్ర
నీట మునిగిన పంట పొలాలు
కౌతాళం/హొసపేటె : కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది ఆదివారం పోటెత్తింది. నదితీరంలో అర కిలోమీటర్‌ మేర పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. కర్ణాటకలోని హోస్పేట్‌ టీబీ డ్యాం నుంచి శనివారం రాత్రి తుంగభద్ర నదికి 92వేలు క్యూసెక్కులు నీరు వదలగా అవి ఆదివారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా సరిహద్దుకు చేరాయి. అప్పటికే రైతులు అప్రమత్తమై తమ వ్యవసాయ విద్యుత్‌ మోటార్లు, పైపు లైన్లను సురక్షిత ప్రాంతానికి తరలించుకున్నారు. 

నీటి ప్రవాహం మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో తీర గ్రామాల రైతులతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. కౌతాళం మండలం కుంబళనూరు వద్ద వరి పైర్లు వేసి పక్షం రోజులు అవుతుండడంతో తమ పంటలపై ఎక్కడ ఇసుక మేట వేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.  

నిలిచిపోయిన రాకపోకలు  
తుంగభద్ర నదిలో ప్రవాహం పెరగడంతో కర్నూలు జిల్లా, కర్ణాటక రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చెళ్లేకుడ్లూరు–మేళిగనూరు మధ్య రవాణా సౌకర్యం నిలిచిపోయింది. దీనితో పాటు కుంబళనూరు వద్ద కూడా వంకకు నీటి ప్రవాహం పెరగడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. మండ్య జిల్లాలో కావేరి నది కూడా ఉప్పొంగుతోంది. కేఆర్‌ఎస్‌ డ్యాం నుంచి భారీగా నీటిని విడుదల చేశారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)