ఇదండీ ‘బాబు సర్కార్‌’ డొల్లతనం.. నారాయణను నిలదీసిన జనం

Published on Sun, 09/15/2024 - 15:51

సాక్షి, విజయవాడ: ప్రచారార్భాటమే తప్ప.. వరద ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు అసంపూర్తిగా సాగుతున్నాయి. వరదలు సంభవించి 15 రోజులైనా రోజులైనా వరద కష్టాలు వీడటంలేదు. నిన్న రాత్రి(శనివారం) కండ్రిగ సాయిబాబానగర్‌లో మంత్రి నారాయణ పర్యటనలో ప్రభుత్వ డొల్లతనం బయటపడింది. మంత్రి నారాయణను వరద బాధితులు నిలదీశారు. తమకు కనీసం మంచినీరు కూడా అందడం లేదని మండిపడ్డారు. ఎక్కడ చెత్త అక్కడే వదిలేశారని ప్రజలు నిలదీయడంతో ఫ్రస్ట్రేషన్‌లోకి వెళ్లిపోయిన మంత్రి నారాయణ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం లక్షకు పైగా కుటుంబాలకు మానని గాయాన్ని మిగిల్చింది. బతుకులను దుర్భరంగా మార్చింది. గత నెల 31న అర్ధరాత్రి విరుచుకుపడ్డ వరదకు సర్వస్వం కోల్పోయి విలపిస్తున్న విజయవాడ శాంతినగర్, పాయకాపురం, పైపుల రోడ్డు, వాంబేకాలనీ, డాబాకోట్లు సెంటర్, ఇందిరానాయక్‌ నగర్, సింగ్‌నగర్‌లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత వార్త: మానని గాయం.. తీరని నష్టం

బుడమేరు వర­దకు ఇళ్లలో వస్తువులన్నీ పాడైపో­యాయి. కాస్త పనికొచ్చే వస్తువులను పాత సామాన్ల వాళ్లు తృణమో పణమో ఇచ్చి పట్టుకెళ్తు­న్నారు. అందుకూ పనికి­రాని వస్తువు­లను బాధి­తులు రోడ్లపై పడేస్తు­న్నారు. దీంతో విజయవాడలోని వరద ప్రాంతాల్లో రోడ్ల  పక్కన పాడైన ఇంటి సామాగ్రి గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోంది.

బాధితులే ఇళ్లలో బురద తొలగించుకుంటున్నారు. పాడైపోయిన విలువైన సామాగ్రితో వీధులన్నీ నిండిపోయాయి. డాబాలపైనే  బాధితులు బతుకీడుస్తున్నారు. పేరుకున్న చెత్త, మురుగుతో వ్యాధులు ప్రబలుతున్నాయి. ఎమ్మెల్యేలు, అధికారులు ఏమైపోయారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)