Breaking News

కృష్ణా నదిలో స్థిరంగా వరద

Published on Wed, 07/31/2024 - 05:43

సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్‌/విజయపురి సౌత్‌: శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్ట్‌ల నుంచి మంగళవారం రాత్రి 9గంటల సమయానికి 3,79,822 క్యూసెక్కుల వరద వస్తోంది. పది గేట్లను పది అడుగుల మేరకు తెరచి 2,75,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సోమవారం నుంచి మంగళవారం వరకు జలాశయానికి 4,51,080 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. శ్రీశైలం నుంచి దిగువ ప్రాంతాలైన నాగార్జున సాగర్, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ, కల్వకుర్తి ఎత్తిపోతలకు 1,21,973 క్యూసెక్కులు విడుదలైంది. 

కుడిగట్టు కేంద్రంలో 15.201 మిలియన్‌ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 18.437 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేశారు. రాత్రి 9గంటల సమయానికి జలాశయంలో 209.5948 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, డ్యాం నీటిమట్టం 883.90 అడుగులకు చేరుకుంది. కాగా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా ప్రధాన పాయలో ఎగువన వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. 

ఆల్మట్టిలోకి 3.01 లక్షల క్యూసె­క్కులు చేరుతుండగా 3 లక్షల క్యూసెక్కు­లను, నారాయణపూర్‌ డ్యామ్‌లోకి 2.85 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 2.77 లక్షల క్యూసెక్కు­లను వదిలేస్తు­న్నారు. జూరాల ప్రాజెక్టులోకి 2.95 లక్షల క్యూసె­క్కులు చేరుతుండగా.. 2.85 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. తుంగభద్ర నదిలో వరద తగ్గుముఖం పట్టింది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)