Breaking News

వరద తగ్గుముఖం.. కొనసాగుతున్న ప్రవాహం

Published on Sat, 08/23/2025 - 03:05

సాక్షి, అమరావతి, పోలవరం రూరల్, ధవళేశ్వరం, విజయపురిసౌత్‌: వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉధృతి క్రమేణా తగ్గుతోంది. ప్రకాశం బ్యారేజీలోకి 4,33,398 క్యూ­సెక్కులు చేరుతుండగా కృష్ణా డెల్టా కాలువలకు 16,776 క్యూసెక్కులు వదలుతూ మిగులుగా ఉన్న 4,16,622 క్యూసెక్కులను అధికారులు సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. 

ధవళేశ్వరం బ్యారేజీలోకి 13,54,996 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. గోదావరి డెల్టా కాలువలకు 12,600 క్యూసెక్కు­లను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 13,42,396 క్యూసెక్కుల గోదావరి జలాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 5,26,876 క్యూ­సెక్కులు కృష్ణాజలాలు చేరుతుండగా.. 4,86,493 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. 

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులోకి 4,32,217 క్యూసెక్కులు చేరుతుండగా.. 4,05,532 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 3,82,121 క్యూసెక్కులు చేరుతుండగా 3,58,902 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులోకి 11,75,859 క్యూసెక్కులు చేరుతుండగా అంతే పరిమాణంలో దిగువకు వదిలేస్తున్నారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)