Breaking News

శాంతిస్తున్న కృష్ణమ్మ

Published on Wed, 09/04/2024 - 04:21

సాక్షి, అమరావతి/విజయపురి సౌత్‌/శ్రీశైలం ప్రాజెక్ట్‌/సత్రశాల/గాందీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపివ్వడంతో కృష్ణా నదిలో వరద తగ్గుముఖం పట్టింది. మంగళవారం సాయంత్రం 7 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 7,03,839 క్యూసెక్కులు చేరుతుండగా.. కాలువలకు 500 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 7,03,339 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ శాంతిస్తుండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కృష్ణా బేసిన్‌లో ఎగువన కూడా వరద ప్రవాహం తగ్గింది. 

ఆల్మట్టి డ్యామ్‌లోకి 47 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ దిగువకు 20 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. నారాయణపూర్‌ డ్యామ్‌లోకి 20 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. 8,272 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులోకి 2 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 2.08 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్‌లోకి 47,911 క్యూసెక్కులు చేరుతుండగా.. దిగువకు 4,809 క్యూసెక్కులు వదులుతున్నారు. 

కృష్ణా, తుంగభద్ర నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,61,292 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్‌వే, విద్యుత్‌ కేంద్రాల ద్వారా దిగువకు 3,38,604 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌లోకి 3,04,115 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్‌వే, విద్యుత్‌ కేంద్రం ద్వారా 2.90 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 4 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. దిగువకు 3.40 లక్షల క్యూసెక్కులు వదిలేస్తున్నారు. మున్నేరు, బుడమేరు, కీసర తదితర వాగుల్లో వరద తగ్గిన నేపథ్యంలో బుధవారం ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి మరింత తగ్గనుంది.  

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)