Breaking News

దోబూచులాడుతున్న గోదావరి

Published on Wed, 07/31/2024 - 05:46

సాక్షి, అమరావతి/పోలవరం రూరల్‌/ధవళేశ్వరం/అమలాపురం: గోదావరి నదిలో వరద ప్రవాహం దోబూచులాడుతోంది. దిగువన వరద తగ్గుతుండగా.. ఎగువన పెరుగుతోంది. ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఖమ్మం జిల్లాల్లో సోమవారం రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, వాగులు, వంకల్లో వరద ఉధృతి పెరిగింది. దీంతో గోదావరిలో మళ్లీ వరద ప్రవాహం పెరుగుతోంది. భద్రాచలం నుంచి ధవళేశ్వరం వరకు బుధవారం గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుందని కేంద్ర జలసంఘం అధికారులను హెచ్చరించింది. 

కూనవరం వద్ద శబరి వరద ఉధృతి అత్యంత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతుందని వెల్లడించింది. ప్రాణహితలో వరద పెరగడంతో తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీలోకి వరద ప్రవాహం 7.71 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. అదేస్థాయిలో బ్యారేజీ నుంచి దిగువకు వదిలేస్తున్నారు. దానికి ఇంద్రావతి వరద తోడవుతుండటంతో తుపాకులగూడెం (సమ్మక్క సాగర్‌) బ్యారేజీలోకి 9.15 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. 

సీతమ్మసాగర్‌­లోకి చేరుతున్న 9.64 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.  పోలవరం ప్రాజెక్టులోకి 10.08 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో దిగువకు వదిలేస్తు­న్నారు. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వ­రంలోని కాటన్‌ బ్యారేజీ వద్ద గోదావరి ఉధృతి మంగళ­వారం మరింత తగ్గింది. సాయంత్రం 6 గంటలకు 175 గేట్లను ఎత్తి బ్యారేజీ నుంచి 11,30,731 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేశారు. దిగువన వరద తగ్గడంతో అంబేడ్కర్‌ కోన­సీమ జిల్లాలోని లంక గ్రామాల్లో ముంపు వీడుతోంది. 

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)