Breaking News

గన్నవరంలో విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్‌.. కారణం ఇదే..

Published on Mon, 12/25/2023 - 11:22

​గన్నవరం: పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలించకపోవటంతో గన్నవరం ఎయిర్‌పోర్టులో మూడు విమానాలు అత్యవసర ల్యాండింగ్‌ అయ్యాయి. చత్తీస్‌గడ్‌ నుంచి హైదరాబాద్, గోవా నుంచి హైదరాబాద్, తిరువనంతపురం నుంచి హైదరాబాద్‌కు రావల్సిన విమానాలను అత్యవసరంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ చేశారు. ఒక్కో విమానంలో సుమారు 150 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఢిల్లీ, హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులను పొగమంచు కమ్మెసింది. దీంతో పలు విమానాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. పొగమంచు వల్ల వాతావరణం అనుకూలించికపోవడంతో ​పలు విమానాలను దారి మళ్లించారు. 

ఉదయం 07:35 గంటలకు మస్కట్ నుంచి శంషాబాద్ రావాల్సిన ఒమాన్ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు. ఉదయం 8:05 గంటలకు  రియాద్ నుంచి రావలసిన విమానం, ఉదయం 9:10 గంటలకు జెడ్డా నుండి రావాల్సిన విమానాలను బెంగళూరుకు దారి మళ్లించారు. పలు విమానాలు బెంగళూరు, నాగపూర్‌కు దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 200 మంది అయ్యప్ప భక్తుల ఆందోళన
శంషాబాద్  ఎయిర్‌పోర్ట్ నుండి కొచ్చి వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం రద్దు కావడంతో  అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. ఉదయం 9:40కి కొచ్చి వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం పొగ మంచు కారణంగా 11 గంటలకు వెళ్లనున్నట్లు  యాజమాన్యం వెల్లడించింది. 11 గంటలు దాటిన విమానాన్ని కొచ్చికి వెళ్లేందుకు సుముఖత చూపకపోవడంతో ఎయిర్‌పోర్టులో  అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. రాత్రి 10:40కి భక్తులకు దర్శనం ఉండడంతో అయ్యప్ప భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?