Breaking News

విశాఖ, గన్నవరంలో పొగ మంచు.. గాల్లోనే విమానాల చక్కర్లు!

Published on Sat, 12/07/2024 - 08:59

సాక్షి, కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగ మంచు అలుముకుంది. ఈ క్రమంలో పొగ మంచు కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ల్యాండింగ్‌కు ఇబ్బందులు తలెత్తడంతో తాజాగా ఎయిర్‌ ఇండియా విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది.

వివరాల ప్రకారం.. గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు అలుముకుంది. విమానాశ్రయంలో పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్‌కు అంతరాయం ఏర్పడింది. పొగ మంచు కారణంగా శనివారం తెల్లవారుజామున ఢిల్లీ నుండి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. దీంతో, ప్రయాణీకులు కొంత ఆందోళనకు గురైనట్టు సమాచారం. ల్యాండింగ్‌కు అనుకూలంగా లేకపోవడంతో హైదరాబాద్‌కు దారి మళ్లించినట్టు తెలుస్తోంది.

మరోవైపు.. విశాఖ ఎయిర్‌పోర్టులో కూడా పొగ మంచు అలుముకుంది. పొగ మంచు కారణంగా అనేక విమానాలను దారి మళ్లిస్తున్నారు అధికారులు. బెంగళూరు నుంచి విశాఖ రావాల్సిన రెండు ఇండిగో విమానాలను హైదరాబాద్‌కు డైవర్ట్ చేశారు. ఢిల్లీ నుంచి విశాఖ రావాల్సిన ఇండిగో విమానం భువనేశ్వర్‌కు దారి మళ్లించారు.

దారి మళ్లించిన విమానాల వివరాలు..
- 6E 581/881 VOMM - VTZ - VOMM (Chennai - Vizag - Chennai) ETA 0615 (1145 IST)
- 6E 7064/7063 VOTP -VTZ - VOTP (Tirupati - Vizag - Tirupati) ETA 0840 (1410 IST)
- 6E 917/6089 VOMM - VTZ- VOMM (Chennai - Vizag - Chennai) ETA1140 (1710 IST) are cancelled for the day
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)