Breaking News

రూ.16 కోట్ల ఇంజక్షన్‌ ఇస్తేనే బతికే అవకాశం

Published on Sun, 10/26/2025 - 07:08

వికారాబాదు జిల్లా: సెంట్రింగ్‌ పనిచేస్తూ జీవనం సాగించే నిరుపేద తల్లిదండ్రులకు కొండంత ఆపద వచ్చిపడింది. ఒక్కగానొక్క కొడుకు అరుదైన వ్యాధి (లక్షల మందిలో ఏ ఒక్కరికో సోకే) బారిన పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. రూ.కోట్ల విలువ చేసే ఇంజక్షన్‌ ఇస్తే కానీ చిన్నారి బతికే అవకాశం లేదని చెప్పడంతో గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. వివరాలు ఇలా.. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గం, బొంరాస్‌పేట్‌ మండలం వడిచర్ల పరిధిలోని ఊరెనికి తండాకు చెందిన ముడావత్‌ శ్రీను, గోరీబాయి దంపతులకు ముడావత్‌ జగన్‌ అనే ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. బతుకుదెరువు నిమిత్తం మూడేళ్ల క్రితం తాండూరుకు వచి్చన వీరు సాయిపూర్‌లో నివసిస్తున్నారు. 

రెండేళ్లుగా జగన్‌ మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. ఎన్ని ఆస్పత్రులు తిప్పినా సరైన చికిత్స అందలేదు. దీంతో అప్పు చేసి హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో ఆస్పత్రికి తీసుకెళ్లగా బాలుడిని పరీక్షించిన వైద్యులు.. బాబుకు అరుదైన, ప్రాణాంతక స్పైనల్‌ మసు్కలర్‌ ఆట్రోపీ (ఎస్‌ఎంఏ) అనే వ్యాధి సోకిందని చెప్పారు. ఇలాంటి వ్యాధి రాష్ట్రంలో ఎవరికీ లేదని, ఇది కొత్త వైరస్‌ వల్ల సోకిందని తెలిపారు. ఈ వ్యాధి నయం కావాలంటే జోల్‌జెన్‌స్మా అనే ఇంజక్షన్‌ ఇవ్వాలన్నారు. 

దీన్ని అమెరికా నుంచి తెప్పించాలని, ఇందుకు రూ.16 కోట్లు ఖర్చవుతుందని చెప్పడంతో బాధిత తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు. ప్రతీ 12 గంటలకు ఒకసారి సిరప్‌ వేస్తేనే మామూలు స్థితికి వస్తున్నాడని, కొంచెం ఆలస్యమైనా ఫిట్స్‌ వస్తోందని కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ ఎమ్మెల్యే, సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి తమ కొడుకును బతికించాలని వేడుకుంటున్నారు. దాతలు సైతం ఆరి్ధక సాయం (ఫోన్‌ పే, గూగుల్‌ పే నంబర్‌ 8639157327), (ఎస్‌బీఐ అకౌంట్‌ నంబర్‌ 43194942778) చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.  

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)