Breaking News

ఏపీలో ఐదు రోజులు వానలే.. ఈ జిల్లాలకు అతి భారీ వర్షసూచన

Published on Thu, 06/12/2025 - 11:03

సాక్షి, విశాఖపట్నం: ఏపీలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాలో అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.

ఈశాన్య రాజస్థాన్‌ నుంచి మధ్య­ప్రదేశ్, ఛత్తీ­స్‌గఢ్‌ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజుల పాటు పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక, గడచిన 24 గంటల్లో అత్యధికంగా ఏలూరు జిల్లాల్లో 15 సెంమీ వర్షపాతం నమోదు అయ్యింది.

నేడు, రేపు.. ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు అతిభారీ వర్షాలు.. బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్‌ ఉంది. పార్వతీ­పురం మన్యం, అల్లూరి సీతారామ­రాజు, కర్నూలు, నంద్యా­ల, శ్రీసత్యసాయి, అన్న­మయ్య, చిత్తూరు, తిరు­పతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలిక­పాటి నుంచి మో­స్తరుగా, మిగతా జిల్లాల్లో అక్కడ­క్కడ తేలిక­పాటి వర్షాలు కురు­స్తాయని తెలిపింది. శుక్ర­వారం పార్వతీ­పురం మన్యం, అల్లూరి సీతా­రా­మ­రాజు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవ­కాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

మరోవైపు.. బుధవారం కృష్ణా జిల్లా మచిలీ­పట్నంలో 10, గుడి­వాడలో 9.4, చల్లపల్లి మండలం పురిటి­గడ్డలో 9.3, బాపట్ల జిల్లా కూచినపూడిలో 7.9 సెం.మీ. వర్షం కురిసింది. పా­ర్వ­­తీపురం మన్యం జిల్లా రస్తాకుంటు బాయి­లో 7.2 సెం.మీ. వర్షం పడింది. తూర్పు­­గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 6.5, అంబేడ్కర్‌ కోన­సీమ జిల్లా తాత­పూడిలో 4.7, ప్రకాశం జిల్లా కొలుకు­లలో 4.4, ఆత్రేయపురంలో 4.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)