Breaking News

పెరుగుతున్న గోదారమ్మ

Published on Thu, 09/05/2024 - 05:14

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురవడం, ప్రధాన పాయతోపాటు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి తదితర ఉప నదులు వరదెత్తడంతో గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చి0ది. బుధవారం సాయంత్రం 6 గంటకు భద్రాచలం వద్దకు 8.79 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 45.55 అడుగులకు చేరుకుంది. దాంతో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 

బుధవారం అర్ధరాత్రికి భద్రాచలం వద్ద నీటి మట్టం 48 అడుగులకు చేరే అవకాశం ఉంది. అప్పుడు అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. పోలవరంలోకి ఎగువ నుంచి వల్చిన వరదను వల్చినట్టుగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 7,02,506 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 1,800 క్యూసెక్కులను విడుదల చేస్తున్న అధికారులు మిగులుగా ఉన్న 7,00,706 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.

ఎగువన తెలంగాణలోని ప్రాజెక్టుల్లోనూ గోదావరి పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ధవళేశ్వరం బ్యారేజ్‌కి వరద మరింత పెరగనుంది. గురువారం ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద నీటి మట్టం 11 అడుగులకు చేరే అవకాశం ఉందని ఇరిగేషన్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. 

48 గ్రామాలకు నిలిచిన రాకపోకలు 
గోదావరి పెరుగుతుండడంతో శబరి నది ఎగపోటుకు గురై చింతూరు మండలంలో వాగులు పొంగుతున్నాయి. దీంతో విలీన మండలాల్లో రహదారులు ముంపునకు గురై 48 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు, వీఆర్‌పురం మండలాల నడుమ, చింతూరు మండలంలో 11 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)