Breaking News

కార్తీక దీపం.. ఇంటినే కాల్చేసింది!

Published on Sat, 11/01/2025 - 11:29

చిత్తూరు జిల్లా: ఇంటి వద్ద కార్తీక శుక్రవారం సందర్భంగా వెలిగించిన దీపం వారి ఇంటినే కాల్చేసింది. ఈ ఘటన మండలంలోని కాగతి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో స్కూటర్‌ కాలిపోగా.. సుమారు రూ.4 లక్షల మేరకు ఆస్తినష్టం వాటిల్లింది. గ్రామస్తుల కథనం.. పుంగనూరు–బోయకొండ ప్రధాన రహదారిలో కాగతి ఉంది. 

రోడ్డు పక్కన ఎల్‌.ఉదయ్‌కుమార్‌, తల్లి శారదమ్మ కలిసి చిల్లర అంగడి నిర్వహిస్తున్నారు. వీటితోపాటు పెట్రోల్‌, గ్యాస్‌ సిలిండర్లను విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో కార్తీక శుక్రవారం కావడంతో షాపు, ఇంటి గడపలో దీపం వెలిగించి పెట్టారు. పెట్రోల్‌ బాటిళ్లు, క్యాన్‌తోపాటు బైక్‌ వరండాలో ఉంచారు. దీపం నుంచి పెట్రోల్‌కు మంటలు చెలరేగి బైక్‌కు వ్యాపించాయి. మంటలు ఎగసి పడడంతోపాటు పొగ కమ్మేసింది. మంటలను అదపుచేసేందుకు స్థానికులు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. 

గ్యాస్‌ సిలిండర్లు ఉన్నాయన్న భయంతో పరుగులు తీశారు. తీరా ఉదయ్‌కుమార్‌ ఇంట్లోనే ఉండిపోవడంతో గ్రామస్తులు, యువకులు సాహసం చేసి ఇంటి కిటికీలు ధ్వసం చేసి అతన్ని బయటకు తీసుకొచ్చారు. అతనికి స్వల్పగాయాలు కాగా.. ప్రాథమిక చికిత్స అందించారు. ఇంట్లోని సామగ్రి, ఎలక్ట్రికల్‌ వస్తువులు, కొయ్య సామగ్రి మొత్తం కాలిబూడిదైంది. ఈ ఘటనతో గ్రామంలోని ప్రజలు, చుట్టుపక్కల నివాసమున్నవారు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. పుంగనూరు నుంచి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)