Breaking News

విశాఖ: అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం

Published on Wed, 12/10/2025 - 08:09

సాక్షి, విశాఖ: విశాఖ బీచ్‌ రోడ్డులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫార్చ్యూన్ అపార్ట్‌మెంట్‌లో ఉవ్వెత్తున అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికంగా భయాందోళనకర వాతావరణం ఏర్పడింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపులోనికి తెస్తున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.  సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 

కాగా ఇటీవలే విశాఖపట్టణంలోని కింజ్‌ జార్జ్‌ ఆస్పత్రి(కేజీహెచ్‌)లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలోని కార్డియాలజీ విభాగంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆస్పత్రిలోని పలు టేబుల్లు, కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. నాడు కేజీహెచ్ ఆర్ ఎం ఓ బంగారయ్య మాట్లాడుతూ ఆస్పత్రిలోని డేటా ఎంట్రీ రూమ్ నుంచి పొగలు రావడాన్ని సిబ్బంది గమనించారని, వెంటనే మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారన్నారు. 

ఆస్పత్రిలోని రోగులు అందరినీ షిఫ్ట్ చేశామని, ప్రమాదంలో ఎవరికీ, ఎటువంటి ఇబ్బంది  ఎదురుకాలేదన్నారు. ప్రమాదంపై వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ స్పందించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. రోగుల పట్ల ప్రభుత్వానికీ, అధికారులకు శ్రద్ద లేదన్నారు. కేజీహెచ్‌లో అధికారుల మధ్య సమన్వయం లేదని, ఎక్కడా సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని గణేష్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, ఓవర్ లోడ్ కారణంగానే షార్ట్ సర్క్యూట్ జరిగిందన్నారు. ఇంత జరిగినా కలెక్టర్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. 

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)