తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?
వినుకొండలో భారీ అగ్ని ప్రమాదం
Published on Fri, 06/27/2025 - 07:03
సాక్షి, పల్నాడు: పల్నాడు జిల్లాలోని వినుకొండలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. చెత్త సేకరించే కంపెనీలో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫైరింజన్లతో మంటలను అర్పుతున్నప్పటికీ ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
#
Tags : 1