Breaking News

లాడ్జిలో అగ్ని ప్రమాదం..ఒకరి సజీవదహనం

Published on Fri, 02/27/2026 - 02:57

రాజంపేట: లాడ్జిలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు సజీవదహనమవగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగడంతో 38 మంది గాయా­లతో బయటపడ్డారు. వైఎస్సార్‌ కడప జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట పట్టణంలోని ఆర్‌ఎస్‌రోడ్‌లో ఉన్న దీప్‌లాడ్జిలోని రిసెప్షన్‌ కౌంటర్‌ వద్ద గురువారం తెల్లవారుజామున షార్ట్‌సర్క్యూట్‌ జరిగి మంటలు చెలరేగాయి. చుట్టుముట్టిన పొగతో ఊపిరాడక ప్రాణభయంతో కొందరు లాడ్జిపైకి చేరుకున్నారు. 

జనసంచారం తక్కువగా ఉండే సమయంలో లాడ్జిపై నుంచి కేకలు వినిపించడం, దట్టమైన పొగ రావడంతో కొందరు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు వెంటనే వచ్చి ప్రమాదంలో చిక్కుకున్న వారిని కిటికీల గుండా కిందకు దించి కాపాడారు. ఈ ప్రమాదంలో ప్రొద్దుటూరు మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన ముత్యాలపాటి వెంకట శ్రీనివాస్‌(32) సజీవ దహనమయ్యాడు. 

ఇతడు కే–సూపర్‌ మార్కెట్‌లో ఎగ్జిక్యూటివ్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా వారిని రాజంపేట ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రులను సబ్‌కలెక్టర్‌ భావన, ఏఎస్పీ మనోజ్‌రామ్‌నాథ్‌హెగ్డే పరామర్శించారు. ఘటనాస్థలాన్ని రాజంపేట అర్బన్‌ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. నిబంధనలు పాటించడంలో లోపాలున్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. కాగా, ఘటనాస్థలిని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పరిశీలించి ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులను తెలుసుకున్నారు.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?