Breaking News

అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం.. ఏడుగురికి గాయాలు

Published on Fri, 06/30/2023 - 12:22

సాక్షి, అనకాపల్లి: అచ్యుతాపురం సెజ్‌లో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. సాహితీ ఫార్మా కంపెనీలో జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడగా.. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులకు కింగ్‌జార్జ్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కంపెనీలోని రెండు రియాక్టర్లు పేలడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటల్ని అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తున్నారు. 

ఘటనపై అనకాపల్లి ఎస్పీ మురళీ కృష్ణ మాట్లాడుతూ.. సాహితీ ఫార్మా కంపెనీలోప్రమాదం జరిగిందన్నారు. సమాచారం రాగానే తమ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని తెలిపారు. కంపెనీలో 35 మంది కార్మికులు విధుల్లో ఉండగా.. 28 మంది బయటకు వచ్చేశారని పేర్కొన్నారు. ఏడుగురికి తీవ్ర గాయలవ్వగా, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. మరో రెండు గంటల్లో మంటలు అదుపులోకి వస్తాయని పేర్కొన్నారు.

విషమంగానే పరిస్థితి
సాహితీ ఫార్మా కంపెనీలో గాయపడిన వారందరి పరిస్థితి విషమంగా ఉందని కింగ్‌జార్జ్‌ ఆసుపత్రి సూపరిండెంట్ శివానంద తెలిపారు. మొత్తం ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. వారందరికీ దాదాపుగా 60 నుంచి 70 శాతం వరకు శరీరం కాలిపోయిందని చెప్పారు.

మొదట ముగ్గురిని ఆసుపత్రికి తీసుకొచ్చారని తరువాత కిమ్స్ ఐకాన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మిగతా నలుగురిని కూడా అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ఇక్కడికి షిఫ్ట్ చేశారని తెలిపారు. క్షతగాత్రులను బర్నింగ్ వార్డుకు షిఫ్ట్ చేసి మెరుగైన వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. కొన్ని గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమన్నారు.

గాయపడిన వారి వివరాలు..
ఒడిశా భువనేశ్వర్‌కు చెందిన రమేష్ (45),రాంబిల్లి మండలం జనగాలపాలేనికి చెందిన సత్తిబాబు (35), రాంబిల్లి మండలం అప్పారాయుడుపాలెం వాసి నూకి నాయుడు (40), విజయనగరానికి చెందిన తిరుపతికి(40)తీవ్రగాయాలు అయ్యాయి. నక్కపల్లి మండలం రెబ్బాకకు చెందిన రాజుబాబు, నక్కపల్లికి చెందిన అప్పారావు (43), అనకాపల్లి జిల్లా కొండకొప్పాకకు చెందిన పిల్లా సంతోష్ కుమార్‌, గాయపడ్డారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)