Breaking News

అనకాపల్లి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. 8కి చేరిన మృతుల సంఖ్య

Published on Sun, 04/13/2025 - 14:16

విశాఖ,సాక్షి: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్లతో మంటల్ని ఆర్పుతున్నారు.

ప్రమాదంపై పోలీసుల  ప్రాథమిక సమాచారం మేరకు.. కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామ శివారులో బాణా సంచా తయారీ కేంద్రంలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదలో మృతుల సంఖ్య అంతకంత పెరుగుతున్నట్లు  తెలుస్తోంది. గాయపడ్డ మిగిలిన  క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. 

ఆదివారం కావడంతో బాణా సంచా కేంద్రంలో పని చేసేందుకు 15మంది మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. లేదంటే అపార ప్రాణ నష్టం జరిగి ఉండేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు, ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ విచారణకు ఆదేశించారు.  

బాణాసంచా పేలుడు ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు:
1. దాడి రామలక్ష్మి (35),
W/oవెంకటస్వామి, 
R/o రాజుపేట .

2. పురం పాప (40),
W/o అప్పారావు, 
R/o కైలాసపట్నం. 

3. గుంపిన  వేణుబాబు (34),
S/o దేముళ్ళు,
R/o  కైలాసపట్నం.

4. సంగరాతి గోవిందు (40),
S/o సత్యనారాయణ, 
R/o కైలాసపట్నం.

5. సేనాపతి బాబూరావు (55)
S/o గెడ్డప్ప ,
R/o చౌడువాడ.

6. అప్పికొండ పల్లయ్య (50)
S/o నూకరాజు ,
R/o కైలాసపట్నం.

7. దేవర నిర్మల (38)
W/o వీర వెంకట సత్యనారాయణ, 
R/o వేట్లపాలెం.

8. హేమంత్ (20)
R/o భీమిలి.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)