Breaking News

కరోనాతో పేరెంట్స్‌ మృతి.. పిల్లలకు 10లక్షలు అందజేత

Published on Sun, 04/23/2023 - 21:22

సాక్షి, అమరావతి: కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన కొల్లు శ్రీవాసవి ప్రవళిక, కొల్లు ఉమాశంకర్ అక్కాతమ్ముళ్లకు సీఎం సహాయ నిధి నుండి రూ.10 లక్షల చెక్కులను హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత అందజేశారు. కొవ్వూరులోని హోం మంత్రి కార్యాలయంలో ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున రెండు చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు. బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని మంత్రి భరోసా ఇచ్చారు.

కాగా.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని జండా పంజా రోడ్డులో నివాసం ఉంటున్న కొల్లు శ్రీ వాసవి ప్రవళిక, ఉమాశంకర్‌లు  కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే తమ తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయారు. 2021లో కరోనాతో తండ్రి కొల్లు శ్రీనివాసరావు(47) జూన్ 5 న మరణించగా, తల్లి కొల్లు శ్యామల(41) జూన్ 9న మృతి చెందారు. ప్రస్తుతం అమ్మమ్మ ఇంట్లో ఉంటున్న అక్క తమ్ముళ్లకు సీఎం సహాయ నిధి ద్వారా సాయం అందించారు. తల్లిదండ్రులను ఇద్దర్నీ ఒకేసారి కోల్పోయి తీవ్ర మనోవేదనలో ఉన్న తమకు ధైర్యాన్ని, భవిష్యత్ పట్ల నమ్మకాన్ని కలిగించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, హోం మంత్రి తానేటి వనితలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబానికి సాయం అందించడానికి హోం మంత్రి చేసిన కృషి, చొరవ ఎప్పటికీ మరువలేనిదని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి కుటుంబాల సంక్షేమం కోసం, ఆపద కాలంలో వారికి అండగా ఉండడం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని తెలిపారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారికి అందజేస్తున్నామని తెలిపారు. పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాలకు గురవుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి పూర్తి విశ్వాసం కల్పిస్తుందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్‌ అహర్నిషలు కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు. రాష్ట్రంలో ఎందరో అభాగ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆసరాగా నిలిచి బతుకుపై భరోసానిచ్చిందని తెలిపారు. 
 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)