Breaking News

రాబడిని పెంచండి!

Published on Sat, 01/03/2026 - 06:06

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పన్నేతర రాబడిని గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రభుత్వ విభాగాలకు సూచించింది. గత కొన్నేళ్లుగా పన్నేతర ఆదాయంలో పెరుగుదల లేదని, ఇందుకు ప్రధాన కారణం పరిపాలన విభాగాలు క్రమానుగతంగా చార్జీలను సవరించకపోవడంతో పాటు పర్యవేక్షణ లేకపోవడమని తెలిపింది. పన్ను రాబడులు పెంచేందుకు సంబంధిత శాఖలు ప్రస్తుత పన్ను రేట్ల ఆధారంగా ప్రతిపాదనలు సమర్పించాలని కోరింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ ప్రతిపాదనలు, ప్రస్తుత ఆర్థిక ఏడాది సవరించిన అంచనాల సమర్పణకు సమగ్ర సూచనలు చేస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్‌ రోజ్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.

ఫిబ్రవరిలో 2026–27 వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీకి సమర్పించనున్నట్లు అందులో తెలిపారు. బడ్జెట్‌ ప్రతిపాదనలను నిధి ఆన్‌లైన్‌ పోర్టల్‌లో ఈనెల 9లోగా ఆన్ని శాఖలు ఆర్థిక శాఖకు సమర్పించాలన్నారు. ఈ నేపథ్యంలో.. ఇప్పుడున్న దానికంటే పన్నేతర ఆదాయం పెంచేందుకు అన్ని శాఖలూ నిర్దిష్ట కార్యాచరణ రూపొందించాలి్సందిగా సూచించారు. వివిధ రకాల వడ్డీలు, డివిడెండ్లు రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలని, పరిపాలన విభాగాల్లో పటిష్టమైన పర్యవేక్షణతో లక్ష్యాలను సాధించాలని కోరింది. హెచ్‌ఓడీలు బకాయిల వసూళ్లపై డ్రైవ్‌ చేపట్టాలన్నారు. ప్రస్తుత సంవత్సరంలో వసూలయ్యే అవకాశమున్న బకాయిలను అంచనా వేయాలని.. రాబడుల్లో లీకేజీలను అరికట్టడానికి చర్యలు చేపట్టడంతోపాటు కఠినమైన నిఘాతో అన్ని స్థాయిల్లో ఉద్యోగుల పనితీరును మెరుగుపర్చి సూచికలను అమలుచేయాలని తెలిపింది.

కొత్తగా ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని ప్రతిపాదించొద్దు..
ప్రస్తుతమున్న ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని సమీక్షించడం ద్వారా వారి  సంఖ్య తగ్గించాలని, కొత్తగా ఎవరినీ ప్రతిపాదించొద్దని.. అలాగే ప్రాజెక్టులు, పథకాలకు సంబంధించిన సిబ్బంది వేతనాలకు మంజూరైన ఉత్తర్వుల ఆధారంగా ఒప్పంద సేవలకు అవసరమైన నిధులు ప్రతిపాదించాలని ఆర్థిక శాఖ తెలిపింది. సంబంధిత శాఖల ఆమోదం తరువాతే కన్సల్టెంట్స్, రిటైర్డ్‌ ఉద్యోగుల పునర్నియామకాలకు వేతనాలను ప్రతిపాదించాలని పేర్కొంది. గత మూడేళ్ల వ్యయం ఆధారంగా నిర్వహణ వ్యయం ప్రతిపాదించాలంది. ప్రభుత్వ అనుమతిలేని ఎలాంటి అంశాలకూ కేటాయింపులు ప్రతిపాదించరాదని చెప్పింది. రాయి­తీలు, నిర్వహణ, సామాజిక పింఛన్లు మొదలైన తప్పని­సరి వ్యయాలకు పూర్తిగా కేటాయింపులు చేస్తామని.. అయితే, లబ్ధిదారుల సంఖ్యతో సహా బడ్జెట్‌ ప్రతిపాదనలు చేయాలి. 

అప్పులతోనే మూలధన వ్యయం..
ఇక మౌలిక సదుపాయాల మూలధన వ్యయానికి అప్పులపైనే ఆధారపడాలని ఆర్థిక శాఖ స్పష్టంచేసింది. కనెక్టివిటీ, గృహ నిర్మాణం, తాగునీరు, విద్య, ఆరోగ్యంతో పాటు పారిశ్రామీకరణ వంటి మూలధన వ్యయ వనరుల ప్రతిపాదనలను పబ్లిక్, ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ), ఈఏపీ, నాబార్డు, హడ్కోల నుంచి నిధులు రాబట్టేలా సంబంధిత ఇంజనీర్లు పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో సమర్పించాలని తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలను సమీక్షించడంతో పాటు వాటి అవసరం, ప్రాధాన్యత, వ్యయాలు, ఫలితాలను పరిశీలించి కాలం చెల్లిన పథకాలను రద్దుచేయాలని చెప్పింది. వేతనాలేతర వ్యయంలో 20 శాతం పొదుపు చేయాలని కోరింది. సాధ్యంకాని, సరిపోని కేటాయింపుల ప్రతిపాదనలను చెయొ్యద్దని ఆర్థిక శాఖ ఆ ఉత్తర్వుల్లో తేల్చిచెప్పింది.

పథకాల వ్యయం అంచనాలు ఇలా..
‘పథకాల వ్యయానికి సంబంధించి ప్రతిపాదనలు సమర్పించడానికి ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. మేనిఫెస్టో పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పూర్తి డేటాతో సంబంధిత శాఖల అధికారులు సమీక్షించాకే ప్రతిపాదనలు పంపాలి. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ప్రతిపాదనలు కేంద్రానికి పంపే ముందు కూడా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. రాష్ట్ర పథకాలు, సంక్షేమ పథకాల లబ్ధిదారుల అర్హతలను సంబంధిత శాఖల అధికారులు సమీక్షించాలి. కేంద్ర ప్రాయోజిత పథకాలకు గత ఏడాది వాస్తవ నిధుల విడుదల ఆధారంగా ప్రతిపాదనలు ఉండాలి. ఊహా­జనిత గణాంకాలతో ప్రతిపాదనలు చెయొ్యద్దు. ఉప ప్రణాళికలతో పాటు మహిళలు, పిల్లల బడ్జెట్‌ను ప్రతిపాదించాలి. బడ్జెట్‌ ప్రతిపాదనలతో పాటు సంబంధిత డాక్యుమెంట్లు, ఉత్తర్వులను శాఖాధిపతులు, సచివాలయ శాఖలు సమర్పించాలి’ అని ఆర్థిక శాఖ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)