Breaking News

ఉపాధ్యాయుల సమస్యలపై పోరుబాట

Published on Sun, 02/22/2026 - 05:41

సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావొస్తున్నా ఉద్యోగ, ఉపా­ధ్యాయుల సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని బహుజన టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూపతి రామారావు, చిట్టేటి రమేష్‌ ఆక్షేపించారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీటీఏ ఆధ్వర్యంలో దశల వారీగా చేపట్టనున్న పోరాటాల కార్యాచరణను శనివారం వెల్లడించారు. ఎన్నికల మేని­ఫెస్టోలో ఉద్యో­గ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల అమలుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని వారు మండిపడ్డారు.

పీఆర్సీ కమిషన్‌ నియమించకపోవడం, మధ్యంతర భృతి ప్రకటించకపోవడం,  4 పెండింగ్‌ డీఏల మంజూరు, తమకు ఇవ్వాల్సిన రూ.34,000 కోట్ల బకాయిల విడుదలపై ప్రభు­త్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటితో పాటు ఆర్థిక, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యక్ష ఆందోళనకు కార్యాచరణ ప్రకటించారు. 

ఈ నెల 23 నుంచి 25 వరకు జిల్లా స్థాయిలో అధికారులకు, అనంతరం ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు అందిస్తామన్నారు. అనంతరం ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని వెల్లడించారు. ఈ నెల 28 నుంచి మార్చి31 వరకు వివిధ దశల్లో నిరసనలు చేపట్టనున్నట్టు తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఏప్రిల్‌ 4న విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తామని పేర్కొన్నారు.    

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)