Breaking News

‘తండ్రి’కి వందనం

Published on Mon, 06/16/2025 - 04:02

పాములపాడు: ఇటీవల విడుదల చేసిన తల్లికి వందనం అర్హుల జాబితాలో తండ్రుల పేర్లు దర్శనమిస్తున్నాయి. ఈ జాబితా చూసిన వారు అవాక్కవు తున్నారు. నంద్యాల జిల్లా పాములపాడు గ్రామానికి సంబంధించి ఇటీవల వెల్లడించిన జాబితాలో ఇదే పరిస్థితి చోటుచేసుకుంది. మొత్తం 724 మంది పేర్లతో జాబితా ప్రదర్శించగా, ఇందులో 20 మంది లబ్దిదారులు తండ్రి పేర్లతో దర్శనమిచ్చాయి. మరో విచిత్రమేమిటంటే జాబితాలో వరుస నెం 93, 96 లో కేవలం ’ న’ అనే అక్షరం పేరుతో లబ్ధి­దారుని పేరుగా చేర్చారు.  

ఆధార్‌ నంబర్లు, బ్యాంకు ఖాతాల్లో తేడాలు  
లబ్దిదారులకు సంబంధించిన జాబితాలో ఆధార్, బ్యాంకు ఖాతాల నంబర్లలో వ్యత్యాసాలు చోటు­చే­సుకున్నాయి. దీంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా తమ  ఖాతాల్లో పథకం నగదు జమకాలేదని చెబుతున్నారు. గత ప్రభుత్వ హయా­ంలో ఎలాంటి హడావుడి లేకుండా నేరుగా తొలిరోజే అమ్మఒడి నగదు పడిందని, అలాంటి పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.

పేరు మారింది.. డబ్బులు రాలేదు 
తల్లికి వందనం జాబితాలో నా పేరు  లేదు. నా భర్త నాగలోకేశ్‌ పేరు వచ్చింది. ఆధార్‌ నంబరు కూడా ఆయనదే ఉంది. పథకం నగదు ఎవరి బ్యాంకు ఖాతాలో పడతాయో తెలీదు. స్కూల్లో మాత్రం నా వివరాలనే ఇచ్చాను. ఇప్పుడేమో జాబితాలో ఇలా. ఏం చేయాలో పాలుపోవడం లేదు.    – బాలీశ్వరమ్మ, పాములపాడు, నంద్యాల జిల్లా

అర్థం కాలేదు 
తల్లికి వందనం అర్హుల జాబితాలో నా భార్య పి. వరలక్ష్మి పేరు లేదు. ఎందుకు రాలేదో అర్థం కాలేదు. అనర్హుల జాబితాలోనూ లేదు. తీరా చూస్తే పిచ్చిగుంట్ల శివక్రిష్ణ  అని నాపేరు వచ్చిoది. ఆధార్‌ నంబరు నాదే ఉంది. తల్లికి వందనం నగదు విషయానికి వస్తే ఇప్పటి వరకు ఎవరి అకౌంట్లోనూ జమ కాలేదు. – పిచ్చిగుంట్ల శివక్రిష్ణ, పాములపాడు

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)