Breaking News

రైతుల వాహనాలను ట్రాక్టర్‌తో ఢీ

Published on Mon, 10/13/2025 - 05:17

గుర్రంకొండ: కూటమి ప్రభుత్వంలో రైతులకు రక్షణ లేకుండా పోతోంది. మండీలకు టమాటాలను తీసుకొచ్చిన రైతుల వాహనాలను ఓ మండీ యజమాని ట్రాక్టర్‌తో తొక్కించిన ఘటన అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో జరిగింది. రెండు ద్విచక్రవాహనాలు, ఒకబొలెరో, ఒక ఆటో దెబ్బ­తి­న్నాయి. 

వాహనాల వద్ద రైతులు లేక పోవడంతో  ప్రా­ణా­­పాయం తప్పింది. జాక్‌పాట్‌ వద్దన్నందుకే తమపై మండీ యజమానులు దౌర్జన్యాలకు దిగుతున్నారంటూ రైతు­లు పేర్కొన్నారు. ఈ ఘటనతో రైతులు మార్కెట్‌యార్డు గేట్లు మూ­సేసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.   

మండీ యజమాని విపరీతం ఇదీ.. 
స్థానిక మార్కెట్‌యార్డుకు ఆదివారం  రైతులు వాహనాల్లో టమాటాలను తీసుకొచ్చారు. ఇక్కడ తగినంత పార్కింగ్‌ స్థలం లేకపోవడంతో తమ వాహనాలను మండీల ముందు ఉంచారు. గత కొన్ని రోజులుగా రైతులు జాక్‌పాట్‌ విధానం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇవి మనసులో పెట్టుకొన్న మండీ యజమానులు రైతులపై కక్ష గట్టారు. 

ఈనేపథ్యంలో ఆదివారం రాత్రి 8 గంటలకు  ఓ యజమాని తన మండీ ముందు వాహనాలు పెట్టారంటూ మరో రైతుకు చెందిన ట్రాక్టర్‌ తీసుకొని రైతుల వాహనాలపైకి వేగంగా ఎక్కించాడు. ఈసంఘటనలో పెద్దమండ్యం మండలానికి చెందిన ఇద్దరు రైతుల ద్విచక్రవాహనాలు ట్రాక్టర్‌ చక్రాల కింద పడి ధ్వంసం అయ్యాయి. కాగా ఒక బొలోరో వాహనం,  ఒక ఆటో దెబ్బతిన్నాయి. 

కట్టలు తెంచుకున్న రైతుల ఆగ్రహం 
ఈ ఘటనతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండీల యజమానులపై తిరగబడ్డారు. అక్కడి నుంచి మార్కెట్‌ యార్డు ముందువైపుకు చేరుకొని  యార్డుగేట్లు మూసేసి  ఆందోళకు దిగారు. మండీల యజమానులు వచ్చి జరిగిన నష్టానికి  పరిహారం చెల్లిస్తామని చర్చలు జరిపినా ఫలించలేదు. విషయం తెలుసుకొన్న పోలీసులు, మార్కెట్‌కమిటీ అధికారులు అక్కడికి చేరుకొన్నారు. మార్కెట్‌కమిటీ సూపర్‌వైజర్‌ నయూబ్‌ బాషా రైతులతో చర్చించారు. 

‘మీరు పట్టించుకోకపోవడంతో మండీల యజమానులు ఇలా రెచ్చిపోతున్నారు’ అంటూ రైతులు ఈ సందర్భంగా పోలీసులపై   ఆగ్రహం వ్యక్తం చేశారు. జాక్‌పాట్‌లు వద్దన్నందుకే మండీల యజమానులు తమపై కక్షగట్టి మమ్మల్ని చంపాలను చూస్తున్నారని  మండిపడ్డారు. జాక్‌ పాట్‌లు అరికట్టాల్సిన అధికారుల చేతగాని తనం వల్లే  ఈ ఖర్మ పట్టిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన జరిగినప్పుడు రైతులు వాహనాల వద్ద ఉండి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. 

కేసు నమోదుకాకుండా ‘మేనేజ్‌’ చేయడం కొసమెరుపు! 
సదరు మండీల యజమానులపై చర్యలు తీసుకొని లైసెన్స్‌­లు రద్దు చేస్తామని మార్కెట్‌ కమిటీ అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. బాధిత రైతులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని ఏఎస్‌ఐ గజేంద్ర పేర్కొన్నారు. అయితే రాత్రంతా మార్కెట్‌ కమిటీ అధికారులు, మండీల యజమానులు బాధిత రైతులను లోబరుచుకొని బెదిరింపులకు గురి చేసి కేసు నమోదు కాకుండా  చేయడం ఈ మొత్తం వ్యవహారంలో కొసమెరుపు.  

జాక్‌పాట్‌ అంటే.. 
మండీలకు రైతులు 100 టమాటా బుట్టలను తీసుకునివస్తే, అందులో 15 నుంచి 20 బుట్టలను ఉచితంగా వ్యాపారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్ని బుట్టలు ఉచితంగా ఇవ్వాలనే అంశంపై నిర్ణయాన్ని వ్యాపారులే తీసుకోవడం ఇక్కడ గమనించాల్సిన మరో విషయం. 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)