Breaking News

యూరియా కోసం రేయింబవళ్లూ పడిగాపులు

Published on Fri, 09/19/2025 - 05:38

సంతకవిటి:  ఉమ్మడి విజయనగరం జిల్లా రైతులను యూరియా కష్టాలు వీడడం లేదు. ఆర్‌ఎస్‌కేలు, పీఏ­సీ­ఎస్‌లు, ప్రైవేటు దుకాణాల వద్ద క్యూ కడుతూనే ఉన్నారు. నిద్రకూడా మానుకుని రాత్రుళ్లూ షాపుల వద్దే పడిగాపులు పడుతున్నారు. వేకువనే అక్కడే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. యూరి­యా కోసం ఇన్ని కష్టాలు ఎన్నడూ చూడలేదంటూ ఆవేదన చెందు­తున్నారు. విజయనగరం జిల్లా సంతకవిటిలో ఓ ప్రైవేటు దుకాణం వద్ద బుధవారం రాత్రి 9 గంటల వరకు యూరియా కోసం క్యూకట్టి­న రైతులు సరుకు అందకపోవడంతో నిరాశచెందారు. 

గురువారం మళ్లీ పంపిణీ చేస్తామని దుకా­ణం యజమాని చెప్పడంతో రాత్రంతా రైతు­లు అక్కడే ఉండిపోయారు. దోమ­లతో జాగారం చేశా­రు. గురువారం వేకువనే ఇలా బారులుతీరారు. భారీ­గా బారు­లు తీరిన రైతులను చూసి యజమాని దుకాణం తెరిచేందుకు భయపడ్డారు. ఏఓ సి.బి.యశ్వంతరావు, పోలీసుల సమక్షంలో దుకాణం తెరిచి యూరియా పంపిణీ ప్రారంభించారు. 

ఆధార్‌కార్డు, వన్‌–బి తెచ్చిన వారికే యూరి­యా ఇస్తామని చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగారు. రాత్రి నుంచి దోమల్లో కాపలా ఉంటే ఇప్పు­డు నిబంధనలు పెట్టడంపై వాగ్వాదానికి దిగారు. టోకెన్‌లు ఉన్న రైతులకు 444 బస్తాలు పంపిణీ చేయడంతో మిగిలిన రైతులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.  

వ్యవసాయం మానేయాలా బాబూ..
నేను దివ్యాంగుడిని. క్యూలైన్‌లో నిల్చోగలనా? నేను వ్యవసాయం మానేయాలా బాబూ.. నేనేమి చేయాలి చెప్పండి. గత ప్రభుత్వంలో రైతుభరోసా కేంద్రాలకే యూరియా వచ్చేది. ఇప్పుడు బస్తా యూరియా కోసం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కనీసం ఒక బస్తా యూరియా కూడా అందలేదు.  – గడే సీతారాం, దివ్యాంగుడు, రైతు, ముకుందపురం  

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)