Breaking News

సాగు భూమి మొత్తాన్నీ తీసుకుంటారా?

Published on Sat, 05/17/2025 - 05:50

ఇబ్రహీంపట్నం: ‘‘ఇదివరకు గ్రామంలో దాదాపు 1,200 ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది. రియల్‌ ఎస్టేట్, కళాశాలలు, పరిశ్రమలకు 600 ఎకరాలు పోయింది. మిగిలిన 581 ఎకరాలను స్పోర్ట్స్‌ సిటీ పేరుతో ప్రభుత్వం తీసుకుంటే.. మా ఇళ్లు మాత్రమే మిగులుతాయి. ఇక వ్యవసాయం ఎక్కడ చేయాలి?’’ అంటూ టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి పార్టీల నేతలు  ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ గ్రామ సచివాలయం వద్ద శుక్రవారం వీరంతా నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సచివాలయ కార్యదర్శి ఎం.మౌనికకు వినతిపత్రం అందజేశారు.

ఆందోళనలో టీడీపీ నాయకులు కేతనకొండ మాజీ సర్పంచి, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ పత్రి లేపాక్షిరావు, పత్రి చలపతి, కొమ్మూరి గోపీ, జనసేనకు చెందిన కొమ్మూరి వెంకటస్వామి, మొక్కపాటి చింతయ్య తదితరులు పాల్గొన్నారు. ఎకరం లోపు ఉన్న రైతులు సుమారు 90 శాతం మంది ఉన్నారని, ఏటా మూడు పంటలు పండే భూములను స్పోర్ట్స్‌ సిటీకి తీసుకుంటే ఎలాగని నిలదీశారు. సన్న, చిన్నకారు రైతుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోందని, స్పోర్ట్స్‌ సిటీతో తమ పొట్టకొట్టొదని వేడుకున్నారు.

కాగా, కేతనకొండ, పరిసర గ్రామాల్లో సుమారు 2,874 ఎకరాల వ్యవసాయ భూమిని తీసుకుంటున్నట్లు రెవెన్యూ అధికారులు గ్రామ సభల్లో ప్రకటించారు. దీంతో తమ ప్రాంతంలో వ్యవసాయం కనుమరుగేనని.. జీవితాలు దుర్భరంగా మారతాయని రైతులు వాపోతున్నారు. అమరావతిలో ల్యాండ్‌ పూలింగ్‌లో తీసుకున్న రైతులకు ఇప్పటికీ ప్లాట్లు కేటాయించలేదని, ఇక తమకెప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. పూలింగ్‌పై పునరాలోచన చేయాలని కోరారు. కాగా, జీవనాధారంగా ఉన్న వ్యవసాయ భూములను పూలింగ్‌కు ఇవ్వబోమని ఇప్పటివరకు రైతులు మాత్రమే అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా వారి బాటలోనే కూటమి నాయకులు ప్రతిఘటించడం గమనార్హం.  

కేతనకొండ గ్రామం 1930లో ఉబ్బడివాగు వాగు పక్కన ఏర్పడింది. ప్రస్తుత 65వ నంబర్‌ జాతీయ రహదారి పక్కన నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. రియల్‌ ఎస్టేట్‌కు 400 ఎకరాలు, పరిశ్రమలు, స్టోన్‌ క్రషర్లు, ప్రైవేట్‌ కళాశాలలు, పాఠశాలల ఏర్పాటుకు 200 ఎకరాలు పోయింది. మిగతాది కూడా తీసుకుంటే వ్యవసాయానికి భూమి మిగలదని రైతులు, కూటమి నాయకులు ఆందోళన చెబుతున్నారు.  

ఉన్నదే 44 సెంట్లు.. అదీ తీసుకుంటారా? 
నాకు 44 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. మూడు పంటలు పండిస్తా. అదే కుటుంబానికి ఆసరా. దీనినీ తీసుకుంటారా? గ్రామంలో 90 శాతం మంది ఎకరం లోపు ఉన్న రైతులే. భూములు తీసుకుంటే వారంతా ఏమవాలి. ఎట్టి పరిస్థితిలో పూలింగ్‌లో భూములు ఇవ్వం. –పయ్యావుల రాము, ఇబ్రహీంపట్నం బీజేపీ ప్రధాన కార్యదర్శి, కేతనకొండ

వ్యవసాయం లేకుంటే నేనేం చేయాలి? 
వ్యవసాయం ఇతర పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. జీవనాధారంగా ఉన్న భూమిని ప్రభుత్వం తీసుకుంటే నేనేం చేయాలి. వ్యవసాయం అలవాటుగా మారింది.  భూమి లేకపోతే పంటలు ఉండవు. పశువులకు మేత, రైతు కూలీలకు పని దొరకదు. 
–షేక్‌ ఉద్దండు, రైతు, మాజీ ఎంపీటీసీ, కేతనకొండ  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)