Breaking News

48 గంటల్లోగా ధాన్యం సొమ్ము ఇవ్వాలి

Published on Tue, 06/24/2025 - 04:35

సాక్షి, అమలాపురం/పిఠాపురం: ‘రైతులను పట్టించుకోండి. పండించిన పంటకు ఇవ్వాల్సిన సొమ్మును 48 గంటల్లో ఇవ్వడి. రైతు పరిస్థితి అస్సలు బాలేదు. పురుగుల మందు తాగి చావాల్సిన దుస్థితి వచ్చింది. మీరే మమల్ని చంపేస్తున్నారు’ అంటూ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం నల్లచెరువు గ్రామానికి చెందిన రైతు వర్రే నాగబాబు రెండు చేతులూ జోడిస్తూ వేడుకున్నారు. జిల్లాలో ఇలాంటి రైతులు వేలాదిగా ఉన్నారు. మే 9 నుంచి ధాన్యం బకాయిల చెల్లింపులు ఒకపైసా కూడా ఇవ్వలేదు. రబీ రైతులకు ఇంకా రూ.248.65కోట్ల వరకూ ధాన్యం డబ్బులు చెల్లించాల్సి ఉంది. రబీ ధాన్యం అమ్మినా కూటమి ప్రభుత్వం సొమ్ము చెల్లించకపోవడంతో రైతులు రోడ్డున పడ్డారు.

అమలాపురంలోని కలెక్టరేట్‌ వద్ద సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్ద కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసేందుకు వచ్చిన ఉప్పలగుప్తం, అమలాపురం, అయినవిల్లి, అల్లవరం మండలాల రైతులు రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు అడ్డుకున్నా వెనక్కి తగ్గలేదు. ధాన్యం సొమ్ము వెంటనే విడుదల చేయాలని, లేకుంటే తాము ఖరీఫ్‌ సాగు చేయలేమని, సాగు సమ్మె చేస్తామని హెచ్చరించారు.

అదేవిధంగా పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ(పాడా) కార్యాలయం వద్ద కూడా ధాన్యం డబ్బులు చెల్లించాలని రైతులు ధర్నా చేశారు. రైతులు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా, సిబ్బంది తీసుకోలేదు. సమస్యను వివరిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు